iDreamPost

వెంటాడిన దురదృష్టం.. కాబోయే మేయర్‌ మృతి

వెంటాడిన దురదృష్టం.. కాబోయే మేయర్‌ మృతి

కరోనాతో మరో అధికార పార్టీ నేత ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు, 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాదర్తి రమేష్‌ గాంధీ ఈ రోజు మృతి చెందారు. ఇప్పటికే కరోనా వల్ల అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి ఎంపీ బల్లిదుర్గా ప్రసాద్, ఎమ్మెల్సీ చల్లా రామకృస్ణారెడ్డి, జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి యర్రబోతుల వెంకారెడ్డిలు కరోనాతో మృతి చెందగా.. తాజాగా గుంటూరుకు కాబోయే మేయర్‌ పాదర్తి రమేష్‌ గాంధీని కరోనా బలితీసుకుంది.

వైశ్య సామాజికవర్గానికి చెందిన పాదర్తి రమేష్‌ గాంధీ గుంటూరులో వైసీపీ కీలక నేతగా ఉన్నారు. పార్టీ నగర అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు నగర మేయర్‌ అభ్యర్థి రేసులో ఉన్నారు. కావటి మనోహర్‌నాయుడు, పాదర్తి రమేష్‌లు ఆ పదవికి పోటీ పడ్డారు. ఇద్దరికీ ప్రాధాన్యత ఇచ్చిన అధికార పార్టీ.. చెరో రెండున్నరేళ్లు మేయర్‌ పదవి దక్కేలా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ ఒప్పుకున్నారు.

పెదకూరపాడు అసెంబ్లీ టిక్కెట్‌ను వదులుకున్న కావటి మనోహర్‌ నాయుడుకు మొదటి రెండున్నరేళ్లు, చివరి రెండున్నరేళ్లు పాదర్తి రమేష్‌గాంధీ మేయర్‌గా కొనసాగుతారని వైసీపీ పెద్దలు నిర్ణయించారు. అయితే కరోనా రూపంలో రమేష్‌ను దురదృష్టం వెంటాడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి