iDreamPost

“గులాబీల జెండలే రామక్క” పాట KCRని మళ్లీ CM చేయబోతుందా?

  • Published Nov 06, 2023 | 5:10 PMUpdated Nov 06, 2023 | 5:26 PM

తెలంగాణ వ్యాప్తంగా ‘గులాబీల జెండలే రామక్క’ పాట మారుమోగిపోతోంది. తెలంగాణ వరకే కాదు.. వివిధ దేశాల్లో తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పాట వినిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో సైతం ఎక్కడ చూసినా ఇదే పాట. అసలు ఎందుకు ఈ పాట ఇంత వైరల్‌ అవుతుందో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ వ్యాప్తంగా ‘గులాబీల జెండలే రామక్క’ పాట మారుమోగిపోతోంది. తెలంగాణ వరకే కాదు.. వివిధ దేశాల్లో తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పాట వినిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో సైతం ఎక్కడ చూసినా ఇదే పాట. అసలు ఎందుకు ఈ పాట ఇంత వైరల్‌ అవుతుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 06, 2023 | 5:10 PMUpdated Nov 06, 2023 | 5:26 PM
“గులాబీల జెండలే రామక్క” పాట KCRని మళ్లీ CM చేయబోతుందా?

జనాన్ని ఉర్రూతలు ఊగించాలన్నా.. ఉద్యమం వైపు నడిపించాలన్నా.. సాహిత్యం, సంగీతం కీలకపాత్ర పోషిస్తాయి. పాటకు ఉండే పవర్‌ అలాంటిది. జానపద పాటలకు, మట్టి పాటలకు పుట్టినిళ్లులాంటి తెలంగాణలో ప్రస్తుతం ఒక పాట మారుమోగిపోతోంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ వాళ్లు ఉన్న ప్రతిచోటా ఈ పాట దుమ్ములేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచార పాటలా ఉన్నా ‘గులాబీల జెండలే రామక్క’ పాట ఎందుకింత వైరల్‌ అయింది? జనాలను ఇంత విపరీతంగా ఆకట్టుకునేందుకు అసలు ఆ పాటలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ ఉద్యమ సమయంలో పాట ఎంత పోరాటం చేసిందో అందరికి తెలిసిందే. చాలా మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. దివంగత గద్దర్‌ రాసి, పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వీర తెలంగాణమా’ పాట ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించి, ఉద్యమం వైపు నడిపించింది. అలాగే ఎన్నికల​ సమయంలో కూడా కొన్ని పాటలు జనాల మైండ్‌ సెట్‌ను, మూడ్‌ను మార్చేస్తుంటాయి. ఉదాహరణకు.. 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. మన జగన్‌’ అలాగే ‘వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాథ రథ చక్రాలు’ పాటలు జనాలను ఎంతల ప్రభావితం చేశాయో మనం చూశాం. ఒక అద్భుతమైన పాట జనసమూహంలో హవాను సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ ‘గులాబీల జెండలే రామక్క’ పాట కూడా బీఆర్‌ఎస్‌కు అలాంటి వైబ్స్‌నే క్రియేట్‌ చేస్తోంది.

సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో ఒక మట్టి పాట, మనసును హత్తుకునే పాట, నిజాన్ని ఎలుగెత్తే పాట ఎంత పదునుగా జన బహుళ్యంలోకి చొచ్చుకుని పోతుందో చెప్పేందుకు ఈ ‘గులాబీల జెండలే రామక్క’ పాటనే చక్కని ఉదాహరణ. ఈ పాట కేసీఆర్‌ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితికి ఎన్నికల ప్రచార పాటగా ఉన్నా.. ఇందులో మట్టి సువాసన ఉంది. పల్లెల్లో వరినాట్లు వేసుకుంటూ.. పాడుకునే పాటలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఆ పాట పాడిన వాళ్లు పెద్ద గాయకులు కాదు. పని సమయంలో, పండగల సమయంలో పల్లె పాటలు పాడుకునే మహిళలు. వారి గాత్రమే ఈ పాటకు ప్రాణం. కొమ్ము లక్ష్మమ్మ ఈ పాటను పాడారు. అలాగే బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ కొరస్‌ అందించారు. పల్లె పరిమళాన్ని వారి గొంతులో నింపుకుని.. అదో పొలిటికల్‌ సాంగ్‌ అనే విషయం కూడా మర్చిపోయి.. ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా డాన్స్‌ వేసేలా పాడారు.

ఇక ఈ పాట ద్వారా.. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనులను, అభివృద్ది కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు. ‘మన అన్న కేసీఆరు రామక్క.. ఏమి పనులు చేసెనే రామక్క’ ‘సావు నోట్ల తల పెట్టి రామక్క.. ఢిల్లి మెడలు వంచినాడు రామక్క’ ‘పాలమూరి కరువు జూసి రామక్క.. పారే నీళ్లు తెచ్చినాడు రామక్క’ ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క’ ఇలా తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ ఏం చేశారు, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణకు ఆయన ఏం చేశారో వివరిస్తూనే.. ప్రతిఒక్కరి అర్థం అయ్యేలా.. కారు గుర్తును గుర్తు చేశారు. ఇక పాటకు ఎంత శక్తి ఉంటుందో.. చెప్పే సబ్జెక్ట్‌ ఎంత సంక్లిష​ంగా ఉన్నా.. దాన్ని పాట ఎంత అందంగా, ఎంత సులువుగా సాధారణ జనానికి కూడా అర్థం అయ్యేలా చేస్తుందో చెప్పడానికి ఈ ‘గులాబీల జెండలే రామక్క’ పాటనే ఉదాహరణ. మరి ఇంత అద్భుత ఆదరణ పొందిన ఈ పాట.. తెలంగాణలో కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేస్తుందో? లేదో చూడాలి? మరి ‘గులాబీ జెండలే రామక్క’ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి