iDreamPost

3 అడుగులే పొడవు.. వైకల్యాన్ని జయించి వైద్యుడిగా..

Gujarat Doctor Made History:కృషీ.. పట్టుదల ఉంటే ఎలాంటి వైకల్యం అడ్డు రాదని ఓ యువకుడు నిరూపించాడు. 3 అడుగుల పొడవు ఉన్నా.. ఎన్నో సవాళ్లను ఎదిరించి వైద్యుడిగా మరాడు.

Gujarat Doctor Made History:కృషీ.. పట్టుదల ఉంటే ఎలాంటి వైకల్యం అడ్డు రాదని ఓ యువకుడు నిరూపించాడు. 3 అడుగుల పొడవు ఉన్నా.. ఎన్నో సవాళ్లను ఎదిరించి వైద్యుడిగా మరాడు.

3 అడుగులే పొడవు.. వైకల్యాన్ని జయించి వైద్యుడిగా..

దేశంలో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో గొప్ప పొజీషన్లో ఉంటాలని భావిస్తుంటారు. అయితే గొప్ప చదువులు చదవాలంటే అన్నీ కుదిరి అదృష్టం కూడా కలిసిరావాలంటారు. చదువుకోవాలని ఆశ ఉన్నా.. కొంతమంది వైకల్యంతో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా మరుగుజ్జు గా ఉండేవాళ్లు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు ఎదుర్కొవడం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది అలాంటి వైకల్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తాము అనుకున్నది సాధిస్తుంటారు. గొప్ప చదువు చదివి సమాజంలో గౌరవమైన పొజీషన్లో ఉంటారు. అలా గణేష్ బరయ్య అనే యువకుడు తన వైకల్యాన్ని జయించి వైద్య వృత్తిని చేపట్టాడు. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ కి చెందిన గణేష్ బరయ్య.. వయసు 23 ఏళ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారారు. ఇటీవల బరయ్య ఎంబీబీఎస్ పూర్తి చేసి జూనియర్ డాక్టర్ గా సేవలందిస్తున్నారు. అయితే కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న బరయ్య ఆ పొజీషన్ లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. నీట్ లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ తక్కువ ఎత్తు ఉండటం వల్ల ఆయనకు ఎంబీబీఎస్ అభ్యసించే అవకాశ లేకుండా పోయింది. సర్జరీలు చేసేందుకు అతడి ఎత్తు అడ్డంకిగా ఉంటుందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే స్కూల్ ప్రిన్సిపాల్ సహాయంతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిశాడు బరయ్య. గుజరాత్ హై కోర్టు కు వెళ్లినా గణేష్ ఇదే కారణంతో నిరాశే మిగిలింది.

తనకు ఎన్ని అడ్డంకులు వస్తున్నా.. సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సుప్రీం కోర్టును ఆశ్రయించి 2018 లో గెలిచాడు. అప్పటికే ఆ బ్యాచ్ మొదలు కావడంతో 2019 ఎంబీబీఎస్ అడ్మీషన్ పొందేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు.. డాక్టర్ అయ్యాడు. ప్రస్తుతం భావ్ నగర్ లోని సర్ టీ ప్రభుత్వం లో జూనియర్ డాక్టర్ గా వైద్యసేవలు అందిస్తున్నాడు. ఇటీవల గణేష్ బరయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గొప్ప ఆశయాలు ఉండేవారికి.. వైకల్యం అడ్డు రాదు. మనం ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని పట్టుదలతో సాధించుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గవొద్దు ’ అని అన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి