iDreamPost

కట్టప్ప చేతుల్లో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ను ఉపేస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా?

  • Published Mar 29, 2024 | 5:45 PMUpdated Mar 29, 2024 | 5:45 PM

పై ఫోటోలో కనిపిస్తున్న కోలీవుడ్ నటుడు సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇక ఆయన చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఇంతకి ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న కోలీవుడ్ నటుడు సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇక ఆయన చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఇంతకి ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Mar 29, 2024 | 5:45 PMUpdated Mar 29, 2024 | 5:45 PM
కట్టప్ప చేతుల్లో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ను ఉపేస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా?

కోలీవుడ్ నటుడు ‘సత్యరాజ్’. ఈయన పేరుకు తమిళ్ నటుడు ఆయన తెలుగుతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. అలాగే దక్షిణాది చిత్రపరిశ్రమలోని విలక్షణ నటుల్లో సత్యరాజ్ కూడా ఒకరు. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో సత్యరాజ్ కట్టప్ప పాత్రలో నటించి.. పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీని సపంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. అయితే పై ఫోటోలో సత్యరాజ్ చేతిలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో. కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం విలన్ గా నటించాడు. ఇంతకి ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో నటుడు సత్యరాజ్ చేతిలో ఎంతో క్యూట్ గా నవ్వులు చిందుస్తున్న ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం విలన్ గా అలరించాడు. అంతేకాకుండా.. ఈయనకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈ హీరో భార్య కూడా ఇండస్ట్రీలో అందరికీ ఫేవరేట్ హీరోయిన్. ఇంతకి ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు.. మలయాళ స్టార్ హీరో ‘ఫహాద్ ఫాజిల్’. ఈయన మలయాళంలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. కాగా, సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ రీమేక్ అయిన ‘ఎన్ బొమ్మకుట్టి అమ్మావుక్’ సినిమా లొకేషన్ సమయంలో..ఆయనతో ఫహాద్ ఫాజిల్ దిగిన ఫోటో ఇది. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఫహాద్ ఫాజిల్ మొదటగా.. 1992లో మమ్ముట్టి, శోభన నటించిన ‘పప్పాస్ ఓన్ అప్పూస్’ చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. ‏ ఆ తర్వాత.. ఫాజిల్ తెరకెక్కించిన ‘కైయేతుం దూరత్’ సినిమాతో.. ఫహాద్ హీరోగా వెండితెర పై ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన నటించిన మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఫహాద్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఫహాద్ ఫాజిల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ‘పుష్ప -2’ చిత్రంలో కూడా ఫహాద్ ఫాజిల్ పాత్ర పూర్తి స్తాయిలో ఉండనుంది. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ భార్య మలయాళీ హీరోయిన్ ‘నజ్రియా నజీమ్’ అని అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు 2014 ఆగస్ట్ 21న కలుసుకున్నారు. అలాగే నజ్రియా, ఫహాద్ కలిసి బెంగుళూరు ‘డేస్’ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2014 ఆగస్టు 21న వివాహ బంధంతో ఒకటయ్యారు. మరి, ఎంతో క్యూట్ గా నవ్వుతూ ఉన్న ఫహాద్ ఫాజిల్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SKM Creations (@salmankm_creations)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి