iDreamPost

కరోన ఎఫెక్ట్ – వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో బయోమెట్రిక్ విధానం తాత్కాలిక రద్దు.

కరోన ఎఫెక్ట్ – వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో బయోమెట్రిక్ విధానం తాత్కాలిక రద్దు.

రాష్ట్రంలో కరోన వ్యాది విజ్రంభిస్తున్న నేపద్యంలో దాని నివారణకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమాహాళ్ళు , మాల్స్, పార్క్ లు , స్విమ్మింగ్ పూల్స్ మూసివేయలని ఆర్డర్ పాస్ చేసింది, అలాగే చిన్న ఆలయాలు, మసీదులు, చర్చులకు వెళ్ళకపోతే మంచిదని, పెళ్ళిల్లు శుభకార్యాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించింది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కరోన వ్యాది కట్టడికి 480 కోట్ల రూపాయలు విడుదల చెసింది అలాగే బస్తీల్లో ఎవరైనా కుటుంబంలో ఒకరికి కరోన వచ్చినట్టు నిర్ధారణ అయితే ఆ ఇంటినంతటిని ఐసోలేషన్ గా పరిగణిస్తామని వారందరికీ నిత్యవసరాలను ఇంటికే సరఫరా చేస్తునట్టు ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే వైరస్ కట్టడికి సి.యం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెల ప్రభుత్వం 58,00,136 మంది లబ్దిదారులకి పంపిణి చేసే వై.యస్.ఆర్ పెన్షన్ కానుక లో ఉపయోగించే బయొమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తునట్టు ప్రకటించింది . ఇప్పుడున్న పరిస్తితుల్లో బయోమెట్రిక్ విధానం పాటిస్తే కరోన వైరస్ ఒకరినుండి మరొకరికి పాకి మరింత విజ్రుంబించే అవకాశం ఉందువల్ల రాబోయే నెల ఒకటవ తారిఖు పంపిణీ చేసే పెన్షన్లో ఈ విధానం లేకుండా చేస్తునట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ విధానానికి బదులుగా గ్రామ , వార్డు వాలెంటీర్లకు జియో కోఆర్డినేటర్స్ ద్వారా మొబైల్ అప్లికేషన్ ఉపయొగించి ఫోటో మరియు సంతకం సేకరించి పెన్షన్ కానుక పంపిణి చేయబోతునట్టు ప్రకటించారు. సంతకం చేయలేని నిరక్షరాస్యులు ఉంటే వారికి పోటో మాత్రమే సేకరించి పెన్షన్ ఇవబోతునట్టు చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి