iDreamPost

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్! లైఫ్ లో సెటిల్ అయిపోయే ఛాన్స్!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తాయి. అలానే పలు రకాల సదుపాయాలను ఈ రేషన్ కార్డు ఉన్నవారికి అందిస్తుంటాయి.. వివిధ రకాల ప్రైవేటు సంస్థలు. అలానే తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి లైఫ్ సెటిల్ అయ్యే ఆఫర్ ఒకటి వచ్చింది.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందిస్తాయి. అలానే పలు రకాల సదుపాయాలను ఈ రేషన్ కార్డు ఉన్నవారికి అందిస్తుంటాయి.. వివిధ రకాల ప్రైవేటు సంస్థలు. అలానే తాజాగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి లైఫ్ సెటిల్ అయ్యే ఆఫర్ ఒకటి వచ్చింది.

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్! లైఫ్ లో సెటిల్ అయిపోయే ఛాన్స్!

నేటికాలంలో ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డులు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. కేవలం ప్రభుత్వ స్కీమ్స్ అందే విషయంలో కాకుండా ఇతర వ్యక్తిగత పనుల విషయంలో కూడా తెల్లరేషన్ కార్డు అవసరం ఉంటుంది. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డు దారులు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ కార్డులను జారీ చేస్తారనే సంగతి అందరికి తెలిసిందే. ఇక తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పలు ప్రైవేటు సంస్థలు కూడా ఉచిత శిక్షణలు ఇస్తుంటాయి. తాజాగా తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి యూనియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణులను దృష్టిలో పెట్టుకొని యూనియన్ బ్యాంక్  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఈ బ్యాంక్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. చంద్రగిరి పట్టణంలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఇవ్వనుంది. చంద్రగిరిలో 30 రోజుల పాటు పురుషులకు ఉచితంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ఇచ్చే శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరైతే చాలు భవిష్యత్తు కు భరోసాగా నిలిచిపోయే ఉపాధి ఉన్న చోటే సంపాదించుకొనవచ్చు.

శుక్రవారం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ..”తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఈ శిక్షణకు అర్హులు. అలానే ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యే పురుషులు 19 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలోనే ఉండాలి. కనీసం విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. శిక్షణ సమయంలో అర్హులకు ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి ఛార్జీలు కూడ ఇవ్వ నున్నట్లు వెల్లడించారు. ఇక 30 రోజుల శిక్షణ అనంతరం ట్రైనింగ్ పూర్తైనట్లు సర్టిఫికెట్ కూడ అందిస్తామని ఆయన తెలిపారు.

ఆసక్తి గలవారు ఆధార్, తెల్ల కార్డు జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని సురేష్ బాబు కోరారు. పూర్తి వివరాల కోసం చంద్రగిరి ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను సందర్శించవచ్చు. అలానే 79896 80587, 94949 51289, 63017 17672 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చిని సంస్థ డైరెక్టర్ తెలిపారు. మరి.. యూనియన్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్న ఈ శిక్షణ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి