iDreamPost

సాయిబాబా భక్తులకు గుడ్​ న్యూస్​.. ఇకపై శిర్డీ సాయి సమాధిని స్పృశించే భాగ్యం..

సాయిబాబా భక్తులకు గుడ్​ న్యూస్​.. ఇకపై శిర్డీ సాయి సమాధిని స్పృశించే భాగ్యం..

షిరిడీ సాయి సమాధిని తాకే భాగ్యాన్ని ఇప్పుడు సామాన్య భక్తులకు సైతం కల్పించనున్నట్లు సాయి సంస్థాన్​ పేర్కొంది. ఈ దీపావళి సెలవుల్లో ఆలయానికి రూ.17 కోట్ల కానుకలు వచ్చినట్లు తెలిపింది.

★ మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.

★ నిత్యం ఆరతి, భజనలతో రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారైనా బాబా సమాధిని స్పృశించాలన్న ఆశ ఉంటుంది.

 శిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. శిర్డీలోని సాయిబాబా సమాధి ముందు ఉంచిన గాజును తొలగించాలని సాయి సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా భక్తులు మునుపటిలా సాయి సమాధిని చేతులతో తాకి దర్శనం చేసుకోవచ్చు.

★ ఒకప్పుడు అది సులభమే అయినప్పటికీ రానురానూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా షిరిడీ సాయి సంస్థాన్ మార్పులు చేసింది.

★ భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది.

★ ఒక్క వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది.

★ సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది.

★ అయితే ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ తెలిపారు.

 శిర్డీలో రద్దీ నేపథ్యంలో భక్తులు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డంగా పెట్టుకున్నారు కేవలం వీఐపీ భక్తులకు మాత్రమే సమాధిని తాకే అవకాశం ఉండేది. సాధారణ భక్తులు దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉండేది.

★ అంతే కాకుండా భక్తుల కోరిక మేరకు సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రణాళికలో ఉన్నామని సాయి సంస్థాన్​ పేర్కొంది.

★ ఈ నిర్ణయాలపట్ల షిరిడీ గ్రామస్థులతో పాటు సాయి భక్తులు ఆనందంగా ఉన్నారు.

★ బాబా సమాధి విషయమై పలు మార్లు సంస్థాన్​కు విన్నవించుకున్నామని.. ఇప్పటికి తమ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలో సాయి సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయి సమాధి చుట్టూ ఉండే గాజు తెరతో పాటు మెష్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఇకపై భక్తులు గతంలో మాదిరి గానే.. తమ చేతులతో శిర్డీ సాయి సమాధిని తాకి.. దర్శనం చేసుకోవచ్చు.

17 కోట్ల ఆదాయం..

★ తిరుమల తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒక్కటి.

★ దీపావళి సెలవుల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఈసారి హుండీ ఆదాయం భారీగా నమోదైంది.

★ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు.. ఆలయానికి రూ.17 కోట్ల 77 లక్షల 53 వేలు కానుకల రూపంలో వచ్చాయి.

★ దక్షిణ పేటికకు – 3 కోట్ల11 లక్షల 79 వేలు

★ విరాళాల రూపంలో – 7 కోట్ల 54 లక్షల 45 వేలు

★ ఆన్​లైన్​ విరాళం- కోటి 45 లక్షల 42 వేలు

★ చెక్​, డీడీ – 3 కోట్ల 3 లక్షల 55 వేలు

★ మనీఆర్డర్లు – 7 లక్షల 28 వేలు

★ డెబిట్​, క్రెడిట్​ కార్డు డొనేషన్​ – కోటి 84 లక్షల 22 వేలు

★ బంగారం – 860.450 గ్రామలు

★ వెండి- 970 గ్రాములు

★ 29 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ- 24 లక్షల 80 వేలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి