iDreamPost

రైతులకు గుడ్ న్యూస్.. PM KISAN 17వ విడత డబ్బులు వచ్చేది ఎప్పుడంటే?

రైతులకు గుడ్ న్యూస్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు త్వరలోనే 17వ విడతకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి. ఖాతాల్లోకి ఎప్పుడంటే?

రైతులకు గుడ్ న్యూస్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు త్వరలోనే 17వ విడతకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి. ఖాతాల్లోకి ఎప్పుడంటే?

రైతులకు గుడ్ న్యూస్..  PM KISAN 17వ విడత డబ్బులు వచ్చేది ఎప్పుడంటే?

భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ శాతం మంది వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. అయితే సరిగా వర్షాలు కురవక పంటలు సరిగా పండక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు పూట గడవని పరిస్థితి తలెత్తుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, పంటల్లో వచ్చే చీడపీడలు రైతులను నిండా ముంచేస్తున్నాయి. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 16 విడతలుగా రైతులకు నిధులు విడుదల చేశారు. ఇక 17వ విడత డబ్బులు ఎప్పుడు రానున్నాయంటే?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు త్వరలోనే 17వ విడతకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి మూడు సార్లు, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ .2,000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ .6,000 అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో మూడు వాయిదాల చొప్పున నిధులు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ క్రమంలోనే 17వ విడత నగదు మొత్తం మే నెలలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే రైతులు కేంద్రం అందించే సాయాన్ని పొందలేరు. పీఎం కిసాన్ పోర్టల్ లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ బీఆర్ డీ ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్ సీ సెంటర్లను సంప్రదించవచ్చు.

ఈకేవైసీ అప్డేట్ ఇలా చేయొచ్చు:

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కు వెళ్లి ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ‘గెట్ ఓటీపీ’ పై క్లిక్ చేసి నిర్దేశిత ఫీల్డ్ లో ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఈ OTPని ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి