iDreamPost

ఆటో డ్రైవర్ల‌కు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.12 వేలు..!

Good News for Auto Drivers: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Good News for Auto Drivers: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆటో డ్రైవర్ల‌కు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.12 వేలు..!

ఇటీవల తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలు పెట్టారు. ఇటీవల మహాలక్ష్మి పథకం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్ 9 నుంచి ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయవొచ్చు. తెలంగాణ లో నివసిస్తున్నట్లు ఐడీ చూపిస్తే చాలు.. ఆర్టీసీ కండెక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తారు. మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.. మహిళలు రోజూ లక్షల్లో బస్సు ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆటో, క్యాబ్, ప్రైవేట్ వాహనదారులు గిరాకీ లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సర్వీస్ బంద్ చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య పిలుపునిచ్చారు. తాజాగా తెలంగాణ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని, వచ్చే బడ్జెట్ లో ఈ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని అసెంబ్లీ వేధికగా ప్రకటించారు. ఎన్నికల సందర్బంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ అభయం ఇచ్చిందని గుర్తు చేశారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తే ప్రతిపక్ష సభ్యులకు ఏంటీ సమస్య? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఆటో డ్రైవర్లకు కనీసం వెయ్యి రూపాల సాయం చేశారా అని ప్రతిపక్ష నేతలను నిలదీశారు. వచ్చే బడ్జెట్ తో ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి