iDreamPost

Good Friday 2024: ‘హ్యాపీ గుడ్​ ఫ్రైడే’ అని విషెస్ చెబుతున్నారా? అలా చెప్పకూడదు! ఎందుకో తెలుసా?

  • Published Mar 28, 2024 | 6:55 PMUpdated Mar 28, 2024 | 6:55 PM

పండుగలకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది సాధారణం. మనకు తెలిసినోళ్లు, బంధువులు, స్నేహితులు ఎదురుపడితే వాళ్లకు విషెస్ చెప్పడం కామన్. అయితే గుడ్ ఫ్రైడే నాడు మాత్రం ఎవరూ విషెస్ చెప్పుకోరు. ఆ రోజు విషెస్ చెప్పకూడదు కూడా. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

పండుగలకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది సాధారణం. మనకు తెలిసినోళ్లు, బంధువులు, స్నేహితులు ఎదురుపడితే వాళ్లకు విషెస్ చెప్పడం కామన్. అయితే గుడ్ ఫ్రైడే నాడు మాత్రం ఎవరూ విషెస్ చెప్పుకోరు. ఆ రోజు విషెస్ చెప్పకూడదు కూడా. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 28, 2024 | 6:55 PMUpdated Mar 28, 2024 | 6:55 PM
Good Friday 2024: ‘హ్యాపీ గుడ్​ ఫ్రైడే’ అని విషెస్ చెబుతున్నారా? అలా చెప్పకూడదు! ఎందుకో తెలుసా?

పండుగలకు విషెస్ చెప్పుకోవడం అనేది సాధారణం. మనకు తెలిసినోళ్లు, బంధువులు, స్నేహితులు ఎదురుపడితే వాళ్లకు విషెస్ చెప్పడం కామన్. ఆ మతం, ఈ మతం అనే తేడాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వమతాల్లోనూ ఈ సంస్కృతి ఉంది. క్రైస్తవుల్లో కూడా ఈ కల్చర్ ఉంది. క్రిస్మస్ వచ్చిందంటే చాలు.. ‘హ్యాపీ క్రిస్మస్’, ‘మేరీ క్రిస్మస్’ అంటూ విషెస్ మొబైల్స్​లో వచ్చి పడుతుంటాయి. డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్​ ఘనంగా జరుపుకుంటారు. పండుగ నాడు పిల్లలకు గిఫ్ట్​లు ఇస్తుంటారు. అయితే క్రిస్మస్​ను ఇంత వైభవంగా జరుపుకునే క్రైస్తవులు.. గుడ్ ఫ్రైడే నాడు మాత్రం ఎవరూ విషెస్ చెప్పుకోరు. ఆ రోజు విషెస్ చెప్పకూడదు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

గుడ్​ ఫ్రైడే నాడు ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే’ అని ఎవరూ మెసేజ్​లు పంపుకోరు. ఎందుకంటే ఇది ఆనందంగా జరుపుకునే పండుగ కాదు. ఆ రోజు క్రైస్తవ సోదరులు ఒకరికొకరు ఎదురుపడినా చిరునవ్వుతోనే పలకరించుకుంటారు. అంతేగానీ విషెస్ చెప్పుకోరు. ఈ పండుగ నాడు పరమ పవిత్రుడైన యేసు మరణానికి సంతాపాన్ని తెలియజేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అందుకే గుడ్ ఫ్రైడే నాడు అన్ని చర్చిల్లో ఆనందోత్సాహాల నడుమ సెలబ్రేషన్స్ జరగవు.

గుడ్ ఫ్రైడే స్పెషాలిటీ!

గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవ సోదరులకు ఒక పవిత్రమైన దినం. ఈ రోజునే యేసును తీవ్రంగా కొట్టి, బతికి ఉండగానే శిలువ వేశారు. దాని మీదే ఆయన తుదిశ్వాసను వదిలారు. పరమపదించడానికి ముందు శిలువ మీద 6 గంటల పాటు ఆయన ఎంతో బాధను అనుభవించారని చెప్పుకుంటారు. ఆఖరిగా ఓసారి పెద్దగా అరిచి చివరి శ్వాసను విడిచి పెట్టారని అంటారు. ఆ సమయంలో లోకమంతా వెలుగును కోల్పోయిందని, భూమి ఒక్కసారి కంపించిందని చెబుతుంటారు. యేసును ఏ తేదీ నాడు శిలువ వేశారో కచ్చితంగా చెప్పలేకపోయినా.. శుక్రవారమే ఇది జరిగిందని క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ చెబుతోంది. అందుకే ఆ రోజే గుడ్ ఫ్రైడే నిర్వహించుకుంటారు.

యేసు మరణించింది ప్రజల కోసం, వారి పాపాలను కడిగివేయడం గురించి. కాబట్టి ఆయన పరమపదించిన శుక్రవారం అందరికీ మంచి చేస్తుందనే నమ్మకంతో ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదాన్ని చేర్చారని చెబుతుంటారు. ఆ రోజు యేసును శిలువ వేసిన క్షణాలను తలచుకొని అందరూ బాధలో ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థనలు చేస్తుంటారు. నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. అందుకే ఆ రోజు ఎవరికీ విషెస్ చెప్పకూడదు.

ఇదీ చదవండి: దేశాన్ని ఊపేసిన సింగర్‌ బయోపిక్‌.. ట్రైలర్ రిలీజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి