iDreamPost

లోన్స్ కోసమే కాదు.. బ్యాంక్ జాబ్ పొందాలన్నా CIBIL స్కోర్ తప్పనిసరి!

బ్యాంకు ఉద్యోగాలకోసం సన్నద్ధమయ్యేవారు సిబిల్ స్కోర్ పై కూడా దృష్టి సారించాల్సిందే. ఐబీపీఎస్ బ్యాంకు ఉద్యోగాలకు సిబిల్ స్కోర్ ను తప్పనిసరి చేస్తూ కొత్త క్రెడిట్ హిస్టరీ నిబంధనను ప్రవేశపెట్టింది.

బ్యాంకు ఉద్యోగాలకోసం సన్నద్ధమయ్యేవారు సిబిల్ స్కోర్ పై కూడా దృష్టి సారించాల్సిందే. ఐబీపీఎస్ బ్యాంకు ఉద్యోగాలకు సిబిల్ స్కోర్ ను తప్పనిసరి చేస్తూ కొత్త క్రెడిట్ హిస్టరీ నిబంధనను ప్రవేశపెట్టింది.

లోన్స్ కోసమే కాదు.. బ్యాంక్ జాబ్ పొందాలన్నా CIBIL స్కోర్ తప్పనిసరి!

బ్యాంకు ఉద్యోగాల కోసం యువత నిరంతరం శ్రమిస్తుంటారు. బ్యాంకు జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమవుతుంటారు. అయితే ఇలాంటి వారికి బ్యాంక్ ఉద్యోగం సాధించడం కాస్త కష్టంగా మారనుంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి చేస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిబంధనలను తీసుకొచ్చింది. దీంతో బ్యాంకు ఉద్యోగార్థులు మంచి క్రెడిట్ స్కోర్ ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగంలో చేరేటప్పుడు సిబిల్ స్కోర్ సమర్పించాలని కోరింది. మరి బ్యాంకు ఉద్యోగం సాధించాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా?

సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది ఖాతాదారుడి క్రెడిట్ రిపోర్టును తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ పొందే సమయంలో ఉపయోగపడుతుంది. అయితే ఆ సంస్థలు లోన్ ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్ ను చూసి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం అందిస్తాయి. లేదంటే నిరాకరిస్తాయి. అయితే ఇప్పుడు లోన్స్ కోసమే కాదు ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలన్నా మంచి సిబిల్ స్కోర్ ఉండాల్సిందే.

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ ను జారీ చేసే ఐబీపీఎస్ బ్యాంకు ఉద్యోగాలకు సిబిల్ స్కోర్ ను తప్పనిసరి చేస్తూ కొత్త క్రెడిట్ హిస్టరీ నిబంధనను ప్రవేశపెట్టింది. బ్యాంకు ఉద్యోగాల కోసం పోటీపడే వారు సిబిల్‌ స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండాలి. ఇలా మెయింటైన్ చేస్తే.. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉద్యోగాన్ని పొందడమే కాకుండా లోన్స్ కూడా సులభంగా పొందొచ్చు. ఒక వేళ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లైతే మీరు బ్యాంకు ఉద్యోగాలను సాధించడం కాస్త కష్టంగా మారనుంది. సిబిల్‌ స్కోర్‌ పెంచుకునేందుకు సకాలంలో బిల్లు చెల్లింపులు చేయాలి. క్రెడిట్ కార్డ్ బకాయిలను గడువులోగా చెల్లించకపోతే జరిమానాలతో పాటు, సిబిల్ స్కోర్ కూడా తగ్గతూ ఉంటుంది. మరి బ్యాంకు ఉద్యోగాలకు సిబిల్ స్కోర్ తప్పనిసరి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి