iDreamPost

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోతున్న బంగారం ధరలు

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోతున్న బంగారం ధరలు

బంగారం అంటే ఎంతో ఇష్టపడే మగువులకు గొప్ప శుభవార్త. వరుసగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం బంగారం ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయదలచిన వారికి ఇది మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. బులియన్ మార్కెట్ లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

శనివారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 గా ట్రెండ్ అవుతుంది. 10 గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 వరకు తగ్గింది. కాకపోతే కిలో వెండి ధర మాత్రం రూ.1000 వరకు పెరిగి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.74,700 వరకు ట్రెండ్ అవుతుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53650 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,530 గా కొనసాగుతుంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు ట్రెండ్ అవుతున్నాయి. వెండి ధర విషయానికి వస్తే.. రూ.77,500 ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.58,530 గా కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.53,900 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.58,800 గా, ముంబైలో 24క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.53,650 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.58,530 గా ట్రెండ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.74,700 ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి