iDreamPost

ఒంటి కాలిపై 10 సిక్సులు! ఇది కదా శివతాండవం అంటే!

  • Author singhj Published - 03:05 PM, Wed - 8 November 23

ఆఫ్ఘానిస్థాన్​పై తన కెరీర్​లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు మ్యాక్స్​వెల్. ఇది మ్యాక్సీకే కాదు వన్డే క్రికెట్​కు ఎంతో స్పెషల్ ఇన్నింగ్స్. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఇన్నింగ్స్​లో అసలు హైలైట్ ఒంటి కాలు మీదే మ్యాక్సీ 10 సిక్సులు కొట్టడం అనే చెప్పాలి.

ఆఫ్ఘానిస్థాన్​పై తన కెరీర్​లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు మ్యాక్స్​వెల్. ఇది మ్యాక్సీకే కాదు వన్డే క్రికెట్​కు ఎంతో స్పెషల్ ఇన్నింగ్స్. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఇన్నింగ్స్​లో అసలు హైలైట్ ఒంటి కాలు మీదే మ్యాక్సీ 10 సిక్సులు కొట్టడం అనే చెప్పాలి.

  • Author singhj Published - 03:05 PM, Wed - 8 November 23
ఒంటి కాలిపై 10 సిక్సులు! ఇది కదా శివతాండవం అంటే!

వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్​లో​ సంచలన ఇన్నింగ్స్​తో అందర్నీ షాక్​కు గురిచేశాడు గ్లెన్ మ్యాక్స్​వెల్. మ్యాక్సీ తుఫాన్​కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలిచింది. 292 పరుగుల ఛేదనలో 91 రన్స్​కే 7 వికెట్లు కోల్పోయిన దశలో కమిన్స్ సేన నెగ్గుతుందని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. మ్యాచ్​లో ఆసీస్ ఓటమి పక్కా కాబట్టి నెట్​ రన్​రేట్ పడిపోకుండా కాస్త ఎక్కువ స్కోరు చేస్తే గొప్పే అనుకున్నారు. కానీ పట్టువదలకపోవడం, ఆఖరి వరకు పోరాడటం ఆస్ట్రేలియా క్రికెటర్లకు వెన్నతో పెట్టిన విద్య అనేది తెలిసిందే. ఇదే తత్వం వారిని నిన్నటి మ్యాచ్​లో గెలిపించింది. స్టార్ ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన ఇన్నింగ్స్​తో వారెవ్వా అనిపించాడు.

ఇన్నింగ్స్ మొదట్లో మ్యాక్స్​వెల్ ఇచ్చిన ఈజీ క్యాచ్​ను ఆఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ వదిలేశాడు. అయితే తాను జారవిడిచింది క్యాచ్​ను కాదు మ్యాచ్​ను అని, అలాగే సెమీస్ ఛాన్స్​ను అని ముజీబ్​కు తర్వాత తెలిసింది. క్యాచ్​తో పాటు ఎల్బీడబ్ల్యూ నుంచి కూడా తప్పించుకున్న మ్యాక్సీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అందరు ఆఫ్ఘాన్​ బౌలర్లను ఉతికి ఆరేసిన అతను.. తన క్యాచ్ వదిలేసిన ముజీబ్​ను చితక్కొట్టాడు. ఎందుకు ఆ క్యాచ్​ను వదిలేశానా అని ముజీబ్​ ఫీలయ్యేలా చేశాడు మ్యాక్సీ. ఆ క్యాచ్ తర్వాత ప్రళయకాళ రుద్రుడిలా మారి డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఆఫ్ఘాన్ బౌలర్లను ఒక రేంజ్​లో ఉతికి ఆరేశాడు. కొడితే బాల్ స్టాండ్​లో పడాల్సిందే అన్నంత కసితో బాదాడు. అంత స్కోరును ఎలా ఛేజ్ చేస్తారా అనే దశ నుంచి మ్యాక్సీ పిచ్చి కొట్టుడుకు 292 టార్గెట్ చూస్తూ ఉండగానే కరిగిపోయింది.

గ్లెన్ మ్యాక్స్​వెల్ మ్యాడ్ ఇన్నింగ్స్​లో 21 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు కూడా ఉన్నాయంటేనే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే మధ్యలో కాలి కండరాలు పట్టేసి నిలబడేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు మ్యాక్సీ. తీవ్ర ఉక్కపోత మధ్య అలసిపోయిన ఆసీస్ బ్యాటర్ క్రీజులో సరిగ్గా నిలబడలేని పరిస్థితి. వంగి షాట్లు కొట్టడమూ కుదరల్లేదు. అయినా ఒంటికాలిపై నిలబడి ఏకంగా 10 సిక్సులు బాదాడు. ఏ మాత్రం టైమింగ్ మిస్సవకుండా, తన బ్యాట్ స్వింగ్​తో అలవోకగా బంతుల్ని స్టేడియంలోని ఫ్యాన్స్ దగ్గరకు తరలించాడు. ఆ టైమ్​లో మ్యాక్సీ ఒంటికాలిపై ఆడుతుంటే శివతాండం చేస్తున్నట్లే అనిపించింది. అందుకే ఈ ఇన్నింగ్స్​ను వరల్డ్ కప్​లోనే కాదు మొత్తం వన్డే క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్​ అని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. ఆఫ్ఘాన్​పై మ్యాక్స్​వెల్ ఒంటికాలిపై ఏకంగా పదు సిక్సులు కొట్టడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మ్యాక్స్​వెల్ డబుల్ సెంచరీపై కొత్త రచ్చ! కపిల్ దేవ్ కన్నా గొప్ప అంటూ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి