iDreamPost

బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తూ రైతును పెళ్లి చేసుకున్న యువతి!

బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తూ రైతును పెళ్లి చేసుకున్న యువతి!

నేటికాలంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి కావడం కష్టంగా మారింది.. రైతే రాజు.. రైతు గొప్ప వాడు అనేవి మాటల వరకే కానీ.. పిల్లలను ఇచ్చే విషయంలో మాత్రం రైతు కనిపించడం లేదు. మంచి జాబ్, మంచి జీతం ఉన్నవారినే అమ్మాయిలు చేసుకుంటున్నారు. సాఫ్ట్ వేరు, ప్రభుత్వ ఉద్యోగం, మంచి ఆస్తి ఉన్న యువకులకే పిల్లను ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వ్యవసాయం చేసేందుకు యువత  ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి తరుణంలోనే ఓ యువతి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె చేసిన పనికి సెల్యూట్ చేయక మానరు.

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని హడ్గావ్ తాలూకాలోని సప్తి అనే చిన్న గ్రామంలో వైష్ణవి దిగంబర్ కదమ్ అనే యువతి ఉంది. తన తల్లిదండ్రులతో కలిసి వైష్ణవి నివాసం ఉంటుంది. ఆమె ఉన్నత చదువులు చదవడమే కాకుండా.. ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ కూడా పూర్తి చేసింది. అయితే ఆమెకు చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే బలమైన కోరిక ఉండేది. అందుకే చదువు పూర్తి కాగానే బ్యాంకు ఉద్యోగానికి  ప్రిపేర్ అయింది. చివరకు అనుకున్న ఉద్యోగం సాధించి.. హడ్గావ్  తాలుకాలోని గోదావరి అర్బన్ బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం  వైష్ణవి.. ఓ బ్యాంకుకి మేనేజర్ గా విధులు నిర్వహిస్తుంది.

ఇక ఆమెకు.. తల్లిదండ్రులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. వైష్ణవి బ్యాంకు మేనేజర్ కావడం,  ఉద్యోగపరంగా మంచి స్థానంలో ఉన్న వ్యక్తుల నుంచి పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్ వేర్లు.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు వచ్చారు. కానీ వైష్ణవి వారందరిని తిరష్కరించి.. ఆమె తల్లిదండ్రులకు షాకిచ్చింది. తానొక రైతు బిడ్డనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. ఒప్పించింది. కూతురి.. ఆలోచన విధానం నచ్చిన ఆమె తల్లిదండ్రులు… రైతుతో పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో పుసాద్ ప్రాంతానికి చెందిన నితిన్ పాటిల్ అనే రైతును వైష్ణవి వివాహమాడింది.

నితిన్ పాటిల్ కు 15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. వైష్ణవి తీసుకున్న నిర్ణయానికి స్థానికులతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురుస్తోంది. వాస్తవానికి వైష్ణవి తండ్రి కూడా ఒక రైతే..  చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూస్తూ పెరిగింది. దీంతో ఆమెకు వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. ఆ కారణంతోనే రైతునే వివాహం చేసుకోవాలని కోరుకుంది. అలానే అనుకున్నది సాధించింది. ఇలాంటి అమ్మాయిలు ఉన్నందుకే రైతులు ఇంకా బతకల్గుతున్నారని కొందరు అభిప్రాయా పడుతున్నారు. మరి… రైతును పెళ్లి చేసుకున్న ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి