iDreamPost

వీడియో: అమ్మానాన్నలపై కోపంతో జలపాతంలో దూకిన యువతి!

వీడియో: అమ్మానాన్నలపై కోపంతో జలపాతంలో దూకిన యువతి!

నేటికాలం యువతలో అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఓర్పు అనేది లేక.. ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి లోనవుతున్నారు. కొందరు యువతలో ఆత్మస్థైర్యం, జీవితం విలువ తెలియక.. ప్రతిదానికి ఆవేశ పడుతుంటారు. కొందరు తల్లిదండ్రులు తిట్టారని, స్నేహితులు ఎగతాళి చేశారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. టీవీ రిమోట్, సెల్ ఫోన్లు విషయంలో కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా తల్లిదండ్రులు తిట్టారని జలపాతంలో దూకింది.ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలోని చిత్రకోట్ జలపాతంలోకి  ఓ యువతి దూకి ఆత్మహత్యకు యత్నించింది. సదరు బాలిక చాలా సమయం పాటు ఫోన్ లోనే కాలక్షేపం చేస్తుంది. దీంతో ఫోన్ వాడే విషయంలో తల్లిదండ్రులు సదరు బాలికను మందలించారు. వారి మాటలకు మనస్తాపం చెందిన బాలిక దారుణమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరిలేని సమయంలో సమీపంలో ఉన్న చిత్రకోట్ జలపాతం వద్దకు చేరుకుంది. చాలా సమయం పాటు జలపాతం  అంచున నిల్చొని అటూఇటూ తిరిగింది. ఆమెను చూస్తున్న పర్యాటకులకు దూరంగా రావాలని హెచ్చరించారు. అయినా వారి మాటలు పట్టించుకోని ఆ యువతి.. అక్కడ తిరిగింది. చివరకు అందరిని షాక్ కి గురి చేస్తూ.. ఒక్క ఉదుటున నీటిలోకి దూకేసింది.

ఆ జలపాతం మధ్యలో నుంచి నీటి అడుగు పడిపోయింది. చివరకు ప్రాణ భయంతో ఈతకొడుతూ బయటకు వచ్చింది. ఆ దగ్గర్లోని వారు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో  రికార్డు చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఆ బాలిక అదృష్టవశాతూ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు వాడి తమ బిడ్డలు పాడైపోయిన.. మందలిస్తే ఆత్మహత్యలకు ప్రయత్నించిన తల్లిదండ్రులో బాధ పడతారని కొందరు అభిప్రాయ పడ్డారు. తల్లిదండ్రులు  కోప పడిన, మందలించిన తమ మంచి కోసమే అని ప్రతి ఒక్క బిడ్డా అర్ధం చేసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.

ఇదీ చదవండి:  బ్రేకింగ్: గుండెపోటుతో మృతి చెందిన ఎమ్మెల్యే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి