iDreamPost

Ghani : బాబాయ్ తేదీని అబ్బాయ్ తీసుకున్నాడు

Ghani : బాబాయ్ తేదీని అబ్బాయ్ తీసుకున్నాడు

ఈ నెల 25న కన్ఫర్మ్ వస్తుందని నమ్ముతున్న భీమ్లా నాయక్ రేస్ నుంచి తప్పుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దాని స్థానంలో వరుణ్ తేజ్ గనిని అఫీషియల్ గా లాక్ చేశారు. ఇందాకే కొత్త పోస్టర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఏపిలో నైట్ కర్ఫ్యూ తీసేసినా సగం సీట్ల ఆక్యుపెన్సీ ఇంకా కొనసాగుతోంది. ఎప్పటి నుంచి ఎత్తేస్తారనే క్లారిటీ ఇంకా రాలేదు. దానికి సంబంధించి ఈ రోజు ఏదైనా ప్రకటన లేదా జిఓ వచ్చి ఉంటే భీమ్లా నాయక్ దింపేద్దాం అనుకున్నారు కానీ అది జరగలేదు. కాబట్టి డ్రాప్ అవ్వడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఈ కారణంగా కొత్త వీడియో సాంగ్ తాలూకు ప్రోమోని ఇంకా అనౌన్స్ చేయలేదు.

శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు 25కే కట్టుబడి ఉంది. ఇప్పుడు గని వస్తున్నా రెండు వేర్వేరు జోనర్లు కాబట్టి పోటీ పరంగా ఇబ్బంది ఉండదు. వీటికన్నా ఒక రోజు ముందు వలిమై ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ కు ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ భీమ్లా నాయక్ వచ్చి ఉంటే ఒకటి తప్పుకోవాల్సి వచ్చేది. కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ తాలూకు ప్రమోషన్ ని ఆపేశారు కాబట్టి అది రానట్టే. మొత్తానికి పవన్ డ్రాప్ కావడం మిగిలిన వాటికి రూట్ క్లియర్ చేసింది. బాక్సాఫీస్ వద్ద డిజే టిల్లు తప్ప ప్రస్తుతం ఇంకే చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఈ ఒక్కటే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఖిలాడీ డిజాస్టర్ దిశగా వెళ్తోంది కాబట్టి రెండో వారం నుంచి పెద్దగా రన్ ఉండకపోవచ్చు.

సో గనికి ఇదంతా కలిసివచ్చే వ్యవహారమే. పైగా మెగా హీరో మూవీకి చాలా గ్యాప్ వచ్చింది. వకీల్ సాబ్ తర్వాత ఆ స్థాయి హైప్ ఉన్న చిత్రం ఆ కాంపౌండ్ నుంచి రాలేదు. రిపబ్లిక్ కూడా సోసోగానే ఆడింది. అందుకే గని 25న ఓపెనింగ్స్ హెవీగా ఉంటాయి.పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు ఆశించవచ్చు. ట్రైలర్ రెడీ చేస్తున్నారు. విడుదల ఫిక్స్ అయ్యింది కాబట్టి ప్రమోషన్ల వేగం పెంచుతారు. చేతిలో కేవలం పది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో భీమ్లాకి ఆ టైం సరిపోదు కాబట్టి గని ఆ అడ్వాంటేజ్ తీసుకుంటోంది. సో వచ్చే వారం అజిత్ – శర్వా – వరుణ్ ల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉండబోతోంది. చూడాలి మరి ఎవరు విజేతగా నిలుస్తారో

Also Read : RC15 : రామ్ చరణ్ సినిమాలో ఊహించని ట్విస్టులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి