iDreamPost

Ghani : బ్రేక్ కోసం మెగా ప్రిన్స్ వెయిటింగ్

Ghani : బ్రేక్ కోసం మెగా ప్రిన్స్ వెయిటింగ్

ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ వరుణ్ తేజ్ గనికి సరైన రిలీజ్ టైం సెట్ కాలేక వాయిదాల మీద వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 8న వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో పద్దెనిమిది రోజులు ఉంది కాబట్టి యూనిట్ ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ప్రమోషన్లు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో చాలా గ్యాప్ తర్వాత కన్నడ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. సునీల్ శెట్టి ఉండటం సెంటిమెంట్ పరంగా అభిమానులను కొంత ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం. ట్రాక్ రికార్డు అలాంటిది.

అంతా బాగానే ఉంది కానీ సౌండ్ సరిపోకపోవడం ఏమిటి అనే డౌట్ రావడం సహజం. వరుణ్ తేజ్ గని కోసం బాగా అంటే బాగా కష్టపడ్డాడు. ఒకరకంగా ప్రాణం పెట్టాడు. కఠినమైన కసరత్తులుతో గని క్యారెక్టర్ కోసం ఒళ్ళు హూనం చేసుకున్నాడు. ఆ మేకోవర్ ని స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఎంత చేసినా ఇది కూడా ఒక ఫార్ములా ప్రకారం సాగే స్పోర్ట్స్ మూవీనే. తల్లి సెంటిమెంట్ అమ్మనాన్నా తమిళ అమ్మాయిని గుర్తుకు తేగా విలన్ గా నవీన్ చంద్ర పాత్ర, బాక్సింగ్ సెటప్ ఇదంతా గతంలో ఎన్నోసార్లు చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. సో గనిలో కొత్తగా ఏముందన్న ప్రశ్నకు సమాధానం ప్రమోషన్ రూపంలో టీమ్ చెప్పాల్సిన అవసరం ఉంది.

డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటిదాకా వైరల్ అనుకునే రేంజ్ లో ఏ పాటా అంతగా రిజిస్టర్ కాలేదు. అఖండ, భీమ్లా నాయక్ తో పోల్చుకుంటే మ్యూజిక్ పరంగా దీనికి వచ్చిన స్పందన తక్కువే. ఇంకా వదలని పాటల్లో ఏదైనా మేజిక్ ఉందేమో చూడాలి. దీనికి రీ షూట్లు కూడా జరిగాయన్న వార్త అప్పట్లో ప్రచారమయ్యింది. యూనిట్ వాటిని ఖండించింది కానీ ఇది హిట్ అయితేనే వరుణ్ తేజ్ పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత గ్యాప్ వచ్చిన మెగా ప్రిన్స్ కేవలం చాలా తక్కువ నిడివిలో గని, ఎఫ్3లతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు

Also Read : Bachchan Paandey Report : బచ్చన్ పాండే రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి