iDreamPost
android-app
ios-app

అమ్మాయిలనే హోటల్ కి తీసుకెళ్తారు.. బిగ్ బాగ్ ఆడిషన్స్ పై ఫిదా నటి సంచలన కామెంట్స్!

  • Published Jun 01, 2024 | 4:24 PM Updated Updated Jun 01, 2024 | 4:49 PM

Gayathri Gupta, Bigg Boss: పిధా సినిమాలో నటించిన గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలానే తరచూ ఏదో ఒక అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఆమె వార్తల్లో ఉంటారు. తాజాగా బిగ్ బాస్ షో పై హాట్ కామెంట్స్ చేసింది.

Gayathri Gupta, Bigg Boss: పిధా సినిమాలో నటించిన గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలానే తరచూ ఏదో ఒక అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఆమె వార్తల్లో ఉంటారు. తాజాగా బిగ్ బాస్ షో పై హాట్ కామెంట్స్ చేసింది.

  • Published Jun 01, 2024 | 4:24 PMUpdated Jun 01, 2024 | 4:49 PM
అమ్మాయిలనే హోటల్ కి తీసుకెళ్తారు.. బిగ్ బాగ్ ఆడిషన్స్ పై ఫిదా నటి సంచలన కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో  వివాదాలు, ఇతర వార్తలు అనేవి సర్వసాధారణం. కొందరు పరిశ్రమను పొగుడుతుందే.. మరికొందరు మాత్రం అందులో జరిగే దారుణాల గురించి చెబుతుంటారు. అలానే తరచూ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చాలా మంది నటీమణులు తమ వాయిస్ ను వినిపించారు. అలానే తరచూ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తమకు జరిగిన అనుభవాల గురించి ప్రస్తావిస్తుంటారు. తాజాగా బిగ్ బాస్ షో పై ఫిదా నటి గాయత్రి గుప్తా హాట్ కామెంట్స్ చేశారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ ఆడిషన్స్ గురించి తెలిపారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

గాయత్రి గుప్తా..గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమాల్లో హీరోయిన్ సాయిపల్లవి స్నేహితురాలి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక చిన్న చిన్న క్యారెక్టర్స్  లో నటించిన గాయత్రి గుప్తా మంచి గుర్తింపును సంపాదించింది. గాయత్రి గుప్తా తరచూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వార్తల్లో ఉండటం మనం చూస్తున్నాం. గతంలో  ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడింది.  అంతేకాక ఆ సందర్భంలో అందరిని తనవైపు తిప్పుకునేలా చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బుర్రకథ,  సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కొబ్బరి మట్ట సినిమాల్లో యాక్ట్ చేసింది. అలానే  ఐస్ క్రీం 2 మూవీలో కూడా గాయత్రీ గుప్తా నటించింది.

Gayatri Gupthaa

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ గురింతి ప్రస్తావించింది.  తెలుగు బిగ్ బాస్ లో  గాయత్రికి ఛాన్స్ వచ్చిందట. కానీ విభేదాల కారణంగా ఆ అవకాశం చేజారిందని గాయత్రీ తెలిపింది. అంతేకాక బిగ్ బాస్ షోపై గాయత్రి సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే ఉండే ఒప్పంద పత్రంలో ఓ చాలా షరతులు ఉంటాయని, వాటన్నింటికి తాను ఒప్పుకున్నానని అన్నారు. అలానే బిగ్ బాస్ కి సైన్ చేసిన తర్వాత ఇతర చిత్రాలకు ఒప్పుకోకూడదని, అలా బిగ్ బాస్ కి ఓకే చేసిన తరువాత తాను 15 సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నాని తెలిపింది. అయితే తనను సడెన్ గా బిగ్ బాస్ నుంచ తీసేశారని తెలిపింది. ఆ షో నిర్వాహకులు అలా చేయడం వల్ల ఏ ఆర్టిస్ట్ కి అయినా చాలా నష్టం అని ఆమె చెప్పుకొచ్చారు.

అందుకే తనకు నష్టం పరిహీరం కావాలని కోర్టుకి వెళ్లినట్లు గాయత్రి చెప్పుకొచ్చింది. అయితే కేసుని మరో కోణంలోకి తీసుకెళ్లి నీరు గార్చేశారని ఆమె తెలిపింది. ఇంకా బిగ్ బాస్ షో గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలని మాత్రం హోటల్స్ కి తీసుకెళతారని గాయత్రి అన్నారుయ. అందుకే బిగ్ బాస్ ఆడిషన్స్ ఆఫీస్ లోనే నిర్వహించాలని కూడా తాను పోరాడినట్లు గాయత్రీ గుప్తా తెలిపింది. ఇదే సమయంలో  అమ్మాయిలని బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో హోటల్ కి తీసుకెళతారనే టాపిక్ మాత్రమే మీడియాలో హైలైట్ అయిందని నటి గాయత్రి అన్నారు.

తనకు నాగార్జున గారిపై , బిగ్ బాస్ షోపై ఎలాంటి వ్యతిరేకత, ద్వేషం లేదని, తాను పోరాటం చేసింది మాత్రం బిగ్ బాస్ షో నిర్వాహకులపైనే అని ఆమె అన్నారు. తాను కోర్టుకు వెళ్లిన తరువాతనే బిగ్ బాస్ రూల్స్ లో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. అందుకే ఆర్టిస్టులకు ఏదైనా నష్టం వాటిల్లితే నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. తాను చేసిన పోరాటం వలన తనకు లాభం లేదు కానీ..చాలా మందికి ఉపయోగపడిందని గాయత్రి గుప్తా వెల్లడించారు. ఇదే విషయాన్ని బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది తెలిపారని గాయత్రీ గుప్తా పేర్కొంది. మొత్తంగా బిగ్ బాస్ పై గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మరి.. గాయత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetHoliganbetCasibomHoliganbetHoliganbetcasibomjojobet günceldeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio