iDreamPost

Rohit-Gambhir: రోహిత్ శర్మ వల్ల నిద్రలేని రాత్రులు గడిపా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

Rohit-Gambhir: రోహిత్ శర్మ వల్ల నిద్రలేని రాత్రులు గడిపా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

ప్రపంచ క్రికెట్ లో ఎందరో క్రికెటర్లు ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రత్యర్థులకు తమ బ్యాటింగ్ తో నిద్రను దూరం చేస్తారు. సందర్భం వచ్చినప్పుడు ఈ విషయాలను వెళ్లడిస్తూ ఉంటారు కొంత మంది ఆటగాళ్లు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు. మరి రోహిత్ వల్ల గంభీర్ నిద్రలేని రాత్రులు ఎందుకు గడపాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

గౌతమ్ గంభీర్.. ఈ టీమిండియా మాజీ క్రికెటర్ ఎప్పుడూ ధోనిపై లేదా.. విరాట్ కోహ్లీపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేసి కూడా న్యూస్ లో వైరల్ అవుతూ ఉంటాడు గంభీర్. ఇదిలా ఉండగా.. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ బీజేపీ ఎంపీ. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ఈ విధంగా మాట్లాడాడు..

“నా మెుత్తం ఐపీఎల్ కెరీర్ లో నాకు నిద్రలేకుండా చేసిన ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ వీళ్లెవ్వరూ కాదు.. రోహిత్ నాకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. ఈ టోర్నీలో ఎంతో మంది ప్లేయర్లను పక్కా ప్లాన్స్ తో పెవిలియన్ కు చేర్చా. కానీ ఒక్క రోహిత్ విషయంలో మాత్రం నేను విఫలం అయ్యాను. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా ఎన్ని వ్యూహాలు పన్నినా.. రోహిత్ ను ఆపలేకపోయేవాళ్లం. అతడి ఆటతీరు అంతలా ఉండేది. మ్యాచ్ కు ముందురోజు అతడిని కోసం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అని మరో ప్లాన్ వేసేవాడిని” అని చెప్పుకొచ్చాడు గంభీర్.

అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సునీల్ నరైన్ కూడా జాగ్రత్తలు చెప్పేవాడిని గంభీర్ పేర్కొన్నాడు. కానీ నరైన్ బౌలింగ్ లో రోహిత్ ఒకే ఓవర్ లో 30 పరుగులదాక చేసేవాడని ఈ సందర్భంగా ఈ మాజీ క్రికెటర్ గుర్తుచేసుకున్నాడు. 2012లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. ఆ మ్యాచ్ లో 109 రన్స్ చేశాడు హిట్ మ్యాన్ ఆ మ్యాచ్ ను కూడా ఈ ఇంటర్వ్యూలో గుర్తుచేశాడు. మరి రోహిత్ శర్మ వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పిన గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: జైస్వాల్‌ సెంచరీ పూర్తి కాగానే డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన రోహిత్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి