iDreamPost

వంశీకి అనారోగ్యం.. అనుచరుల్లో ఆందోళన..

వంశీకి అనారోగ్యం.. అనుచరుల్లో ఆందోళన..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా.. ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని స్పష్టంమవుతోంది. సామాన్యులు, ధనవంతులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా ఎవరినీ కరోనా వైరస్‌ విడిచిపెట్టడం లేదు. అయితే పక్షం రోజుల కిందట వరకూ రోజుకు పది వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగు వేల మధ్య నమోదవుతుండడం ఓకింత ఊరటనిస్తోంది. తాజాగా వైరస్‌ బారిన పడుతున్న వారిలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.

కోవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఏపీలో ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది వైరస్‌ బారిన పడ్డారు. తగ్గుముఖం పట్టిన తర్వాత వైరస్‌ బారినపడిన ప్రజా ప్రతినిధులు లేరనే చెప్పాలి. అయితే తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా వైరస్‌ సోకింది. శనివారం చేసిన పరీక్షల్లో వంశీకి పాజిటì వ్‌ అని తేలిసింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. 14 రోజుల పాటు వంశీ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇటీవల నాలుగు రోజుల నుంచి వంశీని కలిసిన అధికారులు, అనుచరులు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వంశీ ఆరోగ్యంపై ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి