iDreamPost

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. అసలెలా జరిగింది!

నవంబర్ 12 ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ లో టన్నెల్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. దాదాపు 10 రోజులుగా నుంటి వారు అందులోనే ఉండిపోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది.

నవంబర్ 12 ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ లో టన్నెల్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. దాదాపు 10 రోజులుగా నుంటి వారు అందులోనే ఉండిపోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తోంది.

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. అసలెలా జరిగింది!

ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో జరుగుతాయో ఎవ్వరం ఊహించలేము. కొన్ని ప్రమాదాలు ముందుగానే తెలిసి జరిగితే.. మరికొన్ని మాత్రం అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. వరదలు, భూకంపాలు, కొండలు చరియలు విరిగిపడటం, భవనాలు కూలిపోవడం వంటి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే కొన్ని ప్రమాదాల్లో మాత్రం ప్రాణాలతో బయట పడుతుంటారు. అలాంటి ఘటన ఉత్తరాఖండ్ లోని సొరంగం కుప్పకూలిన ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సొరంగం మధ్యలో 41 మంది చిక్కుకున్నారు. ఈ ఘటన జరిగి ఇప్పటికే ఎనిమిది రోజులు దాటింది. అందరూ ప్రాణాలతోనే ఉన్నారు.. కానీ ఒక్కరు కూడా బయటకు రాలేదు. వారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరో రెండు రోజుల్లో వారందరిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఈ టన్నెల్ ప్రమాదం ఏంటి, ఎలా జరిగింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.

నవంబర్ 12, ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ లో టన్నెల్ ప్రమాదం చోటుచేసుకుంది.  ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ లో ఈ సొరంగ నిర్మాణం జరుగుతోంది. చార్ దామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్ యారా నుంచి దండల్ గాన్ ను కలుపుతూ 4 కి.మీ మేర టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఆల్ వెదర్ టన్నెల్ నిర్మాణం లో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణంతో ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఇక ఈ ప్రాంతమంత దట్టమైన అడవులు, కొండలతో ఉంది. ఏదైనా ప్రమాదం జరిగిన కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి విపత్కరమై ప్రాంతంలో ఈ సొరంగ నిర్మాణాన్ని చేపట్టారు.

సిల్క్యారా సొరంగం పనులు 2018లో ప్రారంభమయ్యాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇది ఒక వివాదాస్పద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుందని, ఇప్పటికే అదో పెద్ద సమస్యగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పట వరకు ప్రాజెక్ట్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ పనిచేసే కార్మికుల్లో చాలా మంది బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లకు చెందిన వారు.

ఈక్రమంలోనే ఆదివారం సొరంగం మధ్యలో 150 మీటర్ల మేర కుప్పకూలిపోయింది. దీంతో సొరంగలో పనుల్లో నిమగ్నమైన 41 మంది అందులో చిక్కుకపోయారు. సమాచారం అందుకున్న అధికారులు టన్నెల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అయితే  సొరంగంలో చిక్కుకున్న వారికి వద్దకు చేరుకునేందుకు అధికారులు చాలా కష్టంగా మారింది. వారిని రక్షించేందుకు  గత కొన్ని రోజులుగా సహాయక బృందాలు  రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి.

ఇప్పటి వరకు నాలుగు అంగుళాల పైపు  ద్వారా  ఎండు ఫలాలు, తాగునీరు  వంటివి పంపారు. ఆరు అంగుళాల పైపుతో తొలిసారి వేడి వేడి కిచిడీని పంపారు.  అదే విధంగా కాస్త వెడల్పైన నీళ్ల సీసాల్లో దీనిని నింపి వారి వద్దకు చేర్చారు. ఇదే సమయంలో కూలీలతో అధికారులు మాట్లాడేందుకు రెండు ఛార్జర్లతో పాటు ఒక వాకీటాకీని లోపల కు పంపారు. కొన్ని రోజుల క్రితం గట్టిగా అరచినట్లు శ్రమ లేకుండా ఈ వాకీటాకీ ద్వారా కూలీలతో స్పష్టంగా, సులభంగా మాట్లాడగలుతున్నారు. తొలుత 800మి. మీ వెడల్పు అయిన  పైపులను 22 మీటర్ల వరకు పంపారు.

ఆ తరువాత రాయి తగలడంతో  ఆ పనులు శుక్రవారం నిలిపేశారు. 22-45 మీటర్ల మధ్యనున్న ప్రాంతం అత్యంత కీలకం. రాళ్లు  అడ్డుతగలకపోతే ముడు రోజుల్లోపే కూలీలను బయటకు తెస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 900 మిల్లీ మీటర్ల వ్యాసంతో పైపులతో కూడిన ట్రక్కులు సిల్క యారా ప్రాంతాన్నికి  చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన పది రోజుల తర్వాత ఎండో స్కోప్ కెమెరా ద్వారా.. వారు లోపల ఉన్న వీడియోలను బయటకు విడుదల చేశారు.

సోమవారం సొరంగం లోపలికి శిధిలాల ద్వారా 6 అంచుల పైప్ లైన్ ను విజయవంతంగా చొప్పించడంతో వారితో కనెక్టీవ్ సాధ్యపడింది. సొరంగాల్లో సహాయక చర్యలు చేపట్టాలంటే కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు తప్పకుండా పాటించాలి.  కేవలం సొరంగ విషయమే కాకుండా ఈ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వరదలు, కొండలు విరిగిపడటం వంటి ఘటనలు హిమాల పర్వత రాష్ట్రాల్లో చోటుచేసుకుంటాయి. ఇక్కడ ఎత్తైన కొండలు, అత్యంత లోతైన లోయలతో అత్యంత కఠినంగా ఉంటుంది.

అందుకే తాజాగా సొరంగలోని 41 మందిని కాపాడేందుకు అధికారులు చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. గురువారం కూలీ బయటకి వచ్చే అవకాశం ఉంది. 15 మంది వైద్యులతో పాటు అంబులెన్సులను సొరంగ బయట అందుబాటులో ఉంచారు. కంట్రోల్ రూం లోపలే 8 పడకల ఆస్పత్రిని, దగ్గర్లోనే 41 పడకల ఆస్పత్రిని సద్ధం చేశారు. అవసరాన్ని బట్టీ కూలీలను ఆస్పత్రులకు  తరలించనున్నారు. మరి.. ఉత్తరాఖండ్ లోని టన్నెల్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి