iDreamPost

మహిళలకు ఉచిత ప్రయాణం.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ఆ కార్డు చెల్లదు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటి మహాలక్ష్మి. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితగా ప్రయాణించవొచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటి మహాలక్ష్మి. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితగా ప్రయాణించవొచ్చు.

మహిళలకు ఉచిత ప్రయాణం.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ఆ కార్డు చెల్లదు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల పై తొలి సంతకం చేశారు.  ఈ క్రమంలోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్ ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలతో బస్టాండ్స్ కిట కిటలాడుతున్నాయి. ఈ పథకం మొదలు పెట్టిన వారం రోజుల వరకు ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా ప్రయాణించే అవకాశం కల్పించారు. ఉచిత బస్సు ప్రయాణం కేవలం తెలంగాణలో నివాసం ఉండేవారికి మాత్రమే.. ఇతర రాష్ట్రాల వారికి చెల్లుబాటు లేదు. మహిళలు స్థానికతకు సంబంధించిన కార్డు తప్పని సరి ఉండాలి. తాజాగా మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి అంటూ కీలక సూచన చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలకు షాక్ ఇచ్చింది. ‘మహాలక్ష్మీ-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ మంచి ఆదరణ లభిస్తుంది.. అయితే దీన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం దృష్టిలోకి రావడంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉచిత ప్రయాణ సౌకర్యం పొందాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డులు తప్పని సరి అని తేల్చి చెప్పింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో, అడ్రస్ స్పష్టంగా ఉండాలని తెలిపింది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్ కి వర్తింస్తుంది. అంతేకానీ పాన్ కార్డులో అడ్రస్ ఉండని కారణంగా ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని క్లారిటీ ఇచ్చారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఒరిజినల్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని.. లేదంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొంతమంది మహిళలు ఈ స్కీమ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఎలాగూ ఉచితమే కాదా.. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని సిబ్బందితో వాదనలకు దిగుతున్నారని మండిపడ్డారు. కొంతమంది స్మార్ట్ ఫోన్లలో, ఫోటో కాపీలు, కలర్ జీరాక్స్ ఇలా చూపిస్తున్నారు. వీటి వల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి అవుతున్నారు.  ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావొద్దని హెచ్చరించారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బు టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రియింబర్స్ మెంట్ చేస్తుందని అన్నారు. టికెట్ లేకండా ప్రయాణిస్తే ఆర్టీకి తీవ్ర నష్టం వస్తుందని అన్నారు. అంతేకాదు.. టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. చెకింగ్ లో గుర్తిస్తే అన్యాయంగా సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని గుర్తు చేశారు. ఇలాంటి తప్పులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి