iDreamPost

ప్రపంచంలోనే తొలిసారి.. ఆ దేశానికి ప్రధాన మంత్రిగా గే!

ఆ దేశంలో అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ స్వలింగ సంపర్కుడిని దేశ ప్రధాన మంత్రిగా నియమించారు. దీంతో ప్రపంచంలోనే తొలి గే ప్రధానిగా రికార్డ్ సృష్టించాడు.

ఆ దేశంలో అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ స్వలింగ సంపర్కుడిని దేశ ప్రధాన మంత్రిగా నియమించారు. దీంతో ప్రపంచంలోనే తొలి గే ప్రధానిగా రికార్డ్ సృష్టించాడు.

ప్రపంచంలోనే తొలిసారి.. ఆ దేశానికి ప్రధాన మంత్రిగా గే!

స్వలింగ సంపర్కులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో సైతం అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో పలువురు స్వలింగ సంపర్కులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ దేశంలో మరో సంచలనం నమోదైంది. ఓ దేశ అధ్య క్షుడు ఆ దేశ ప్రధానిగా గేను నియమించారు. అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ దేశానికి తొలి గే ప్రధానిగా ఎన్నికవడంతో అక్కడ చర్చకు దారితీసింది. ప్రస్తుతం ప్రధానిగి ఎంపికైన గే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ దేశ ప్రధాని పదవికి ఎలిజబెత్‌ బోర్న్‌ రాజీనామా చేయడంతో తాజా నియామకం జరిగింది.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న గాబ్రియెల్‌ అట్టల్‌ను ప్రధాన మంత్రిగా నియమించారు. కాగా అట్టల్‌ ఈ పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడిగా రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఆయన వయసు 34. స్వలింగ సంపర్కుడని తెలుస్తోంది. విదేశీయులను బహిష్కరించే ప్రభుత్వ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఇమ్మిగ్రేషన్ చట్టంపై ఇటీవలి రాజకీయ గందరగోళం కారణంగా అతని కంటే ముందు ప్రధానిగా ఉన్న ఎలిసబెత్ బోర్న్ జనవరి 8న రాజీనామా చేశారు. సోమవారం మెక్రాన్‌ దానికి ఆమోదం తెలిపారు. త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు అధ్య క్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఫ్రాన్స్ ప్రధానిగా గే ను నియమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి