iDreamPost

‘ఫార్ములా–ఈ’ రేసింగ్‌ కౌంట్‌డౌన్‌ షురూ

‘ఫార్ములా–ఈ’ రేసింగ్‌ కౌంట్‌డౌన్‌ షురూ

ప్రపంచంలో అత్యంత వేగంగా ఆదరణ పొందుతున్న ‘ఫార్ములా-ఈ’ రేసింగ్‌ తొలి సారి భారత్‌లో ట్రాక్‌ ఎక్కనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లాంఛనంగా అభిమానుల కోలాహలం మధ్య శుక్రవారం 100 రోజుల కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది.

First Formula E world championship to be held in Hyderabad next year;  100-day countdown startsకేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి, నీతి ఆయోగ్‌ సిఇఒ అమితాభ్‌ కాంత్‌ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫార్ములా-ఇ ప్రిక్స్‌ ఈవెంట్‌ను ప్రపంచంలోని పన్నెండు దేశాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, అందులో భారత్‌ కూడా ఒకటని గుర్తుచేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగనున్నది ఈ ఈవెంట్‌కు సంబంధించిన తొమ్మిదవ సీజన్‌ అని వివరించారు.

Formula E Racing To Come To Hyderabad

గ్లోబల్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ ఇప్పుడు లండన్‌, బెర్లిన్‌, రోమ్‌, సౌ పాలో, మెక్సికో, జకార్తా, కేప్‌ టౌన్‌, మొనాకో, దిరియా (సౌదీ అరేబియా) సరసన నిలివనుంది. రానున్న నాలుగు సంవత్సరాల వరకు ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. 2014లో ప్రారంభమైన ఫార్ములా-ఈ రేసింగ్‌ ఇప్పటివరకు 100 రేసులను పూర్తి చేసుకుంది. నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి హెచ్‌ఎండిఎ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఏర్పాట్లను చూడనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి