iDreamPost

పుకార్లు నమ్మొద్దు.. పార్టీ మార్పు వివేక్ ఏమన్నారంటే..!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పుకార్లు నమ్మొద్దు.. పార్టీ మార్పు వివేక్ ఏమన్నారంటే..!

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమకు సీటు దక్కని అంసతృప్తి నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోపాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. ఈరోజు రాజగోపాల్ రెడ్డి బీజేపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన రాజీనామా ప్రచారంపై వీవేక్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి 27న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈ మేరకు తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా తాను పార్టీ మారబోతున్న పుకార్లపై స్పందించారు వివేక్ వెంకటస్వామి.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి నడుస్తుంది.. ఈ నేపథ్యంలో కొంతమంది నాపై లేని పోని పుకార్లు సృష్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు మాజీ ఎంపీ వివేక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా నేను బీజేపీ ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నానని లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. నేను బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం నాకు తెలియదని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి