iDreamPost

ఆరేళ్లు MLAగా ఉన్నారు..అయినా ఉపాధి కూలీ పనికి! కన్నీటి కథ..

Former MLA Chukka Pagadalamma: నేటికాలంలో రాజకీయాల్లో కూడబెట్టుకునే నేతలే ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తుంటారు. అందుకే కొందరు చాలా ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసి.. చాలా సాధారణ స్థితిలో జీవనం సాగిస్తున్నారు.

Former MLA Chukka Pagadalamma: నేటికాలంలో రాజకీయాల్లో కూడబెట్టుకునే నేతలే ఎక్కువగా కనిపిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తుంటారు. అందుకే కొందరు చాలా ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసి.. చాలా సాధారణ స్థితిలో జీవనం సాగిస్తున్నారు.

ఆరేళ్లు MLAగా ఉన్నారు..అయినా ఉపాధి కూలీ పనికి! కన్నీటి కథ..

నేటికాలంలో రాజకీయంల్లోకి వెళ్లేది.. దోచుకోవడం కోసమే కానీ, సేవ చేయడం కోసం కాదనేది చాలా మంది అభిప్రాయం. వాటిని నిజం చేస్తూనే చాలా మంది పొలిటిషియన్లు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అడ్డదారుల్లో మింగేస్తున్నారు. అయితే ఒకప్పుడు రాజకీయం నేటి రాజకీయానికి చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన ప్రజా ప్రతినిధులే ఎక్కువ. అలా తాము ఎమ్మెల్యేగా గెలిచిన కూడా ఎక్కడా  అవినీతి సొమ్మును కూడా బెట్టుకునే ప్రయత్నం చేయలేదు. అలాంటి నిజాయితీ పరులైన ప్రజాప్రతినిధులు నేటికీ కూలీలుగా ఉంటూ పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. వారి జాబితాకు చెందిన వ్యక్తే..మాజీ ఎమ్మెల్యే సుక్కా పగడాలమ్మ.

మనం తరచూ రాజకీయ నాయకులకు సంబంధించిన వార్తలు వింటుంటాము. అయితే కొందరి గురించి తెలుసుకున్నప్పుడు కళ్ల వెంట నీరు రాక మానదు. కొన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి, ఎన్నో పదవులు అనుభవించి కూడా.. చివరికి అతి సామాన్య జీవితం గడుపుతుంటారు. ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు పూరి గుడిసెల్లో దీనస్థితిలో జీవనం సాగిస్తున్నారు.  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్కా పగడాలమ్మ కూడా ప్రస్తుతం అలాంటి జీవనం సాగిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని ముక్తాపురం గ్రామంలో

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇట్లో పగడాలమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె 1972లో పాతపట్నం ఎమ్మెల్యేగా పని  చేశారు. సుక్కా పగడాలమ్మ పాతపట్నం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. సుమారు 8 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1978లో పాలకొండ నియోజకవర్గం వర్గం నుంచి బరిలో దిగి అపజయం చెందారు.  దీంతో ఆమె మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు. కానీ, మధ్యలో కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక కొంతకాలం పాటు ఉపాధి హామీ పనులకు కూలీగా వెళ్లారు. అయితే తన గురించి, రాజకీయ ప్రస్థానం గురించి పగడాలమ్మ అనేక విషయాలను వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏడుగురికి ఒకేసారి ఉద్యోగాలు ఇప్పించాని, వారు తన ఇంటికి వచ్చి ఏడు అపిల్ పండ్లు ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. అదే విధంగా ఒకాయనకు చిత్తూరులో పెద్ద పోస్టింగ్ ఇప్పిస్తే, సొంత ఖర్చులతో తమ కుటుంబాన్ని తిరుమల తీసుకుని వెళ్లాడని పగడాలమ్మ చెప్పారు.

ఇక తాను ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారో పగడాలమ్మ చెప్పొకొచ్చారు. “1972లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. దాంతో కాంగ్రెస్ నాకు టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన నేను మంచి మెజార్టీతోనే  విజయం సాధించాను. ఇక ఎమ్మెల్యే అయిన తరువాత పాతపట్నంలో అనే అభివృద్ధి పనులు చేశాను. ఎమ్మెల్యేగా గ్రామాలకు బస్సుల్లోనే వెళ్తూ, బావులు, చెరువుల్లోని నీటిని తాగేవాళ్లం. పాతపట్నంలో 60 గ్రామాలకు మొదటగా విద్యుత్ సౌకర్యం తీసుకుని వచ్చింది నేనే. పాతపట్నం జూనియర్ కళాశాల, పెద్దమడిలో గిరిజన ఆశ్రమ పాఠశాల, కరజాడలో హైస్కూల్ నేను తీసుకురాగలిగాను. ఎమ్మెల్యేగా తాను తొలి జీతం రూ. 300 తీసుకున్నానాను. ఆ తర్వాత రూ. 600కి పెరిగింది.

ఇంతా నియోజవర్గ అభివృద్ధికి పాటుపడిన కానీ, ఏ రోజూ నా కోసం ఒక్క పైసా కూడబెట్టుకోలేదు. ఎక్కడా భూమి సంపాదించుకోలేదు. మాకున్న 30 ఎకరాల భూమి నేను ఎమ్మెల్యేగా దిగిపోయేనాటికి 4 ఎకరాలైంది. అప్పటికే పాడైపోయిన మా ఇల్లు తిత్లీ తుపానుకు చాలా వరకు దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరుకుంది. దాంతో ఇప్పుడు ఎండ, వాన నుంచి నాకు రక్షణ లేకుండా పోయింది” అని ఆమె తెలిపారు. ప్రస్తుతం పగడాలమ్మ వయస్సు 75 ఏళ్లు. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మూడేళ్ల క్రితమే చనిపోయారు. ఇక ఎమ్మెల్యే కావడమే ఆమెకు శాపంగా ఉన్నట్లు ఉంది.

ఉపాధి పనులకు కూలీగా కొంతకాలం వెళ్లిన తరువాత.. ఆమె మాజీ ఎమ్మెల్యే అని తెలిసి.. పనికి వద్దన్నారు. ప్రస్తుతం పగడాలమ్మకు రూ.30 వేలు పెన్షన్ వస్తుంది. కానీ, ఆ డబ్బుతో ఇల్లు బాగు చేసుకుందామంటే నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదు. దీంతో ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందా అని ఎదురు చూస్తున్నానని పడగాలమ్మ చెప్పుకొచ్చారు. ప్రజల అభివృద్ధి కోసం పాటు పడిన ఆమె.. నేడు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాత ఇంటిలోనే నివాసం ఉంటూ దానిని బాగు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. ఇలాంటి నిజాయితీ పరులైన ఎమ్మెల్యేలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి