iDreamPost

టీమిండియాలో అతడు బాక్సాఫీస్ ప్లేయర్.. గ్రౌండ్ లోకి దిగితే విధ్వంసమే: ఇంగ్లాండ్ దిగ్గజం

భారత జట్టులో ఆ ఆటగాడు బాక్సాఫీస్ ప్లేయర్, అతడు బ్యాటింగ్ కు దిగితే.. గ్రౌండ్ లో పెను విధ్వంసమే అంటూ కితాబిచ్చాడు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్లేయర్ నాసిర్ హుస్సేన్. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు?

భారత జట్టులో ఆ ఆటగాడు బాక్సాఫీస్ ప్లేయర్, అతడు బ్యాటింగ్ కు దిగితే.. గ్రౌండ్ లో పెను విధ్వంసమే అంటూ కితాబిచ్చాడు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్లేయర్ నాసిర్ హుస్సేన్. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు?

టీమిండియాలో అతడు బాక్సాఫీస్ ప్లేయర్.. గ్రౌండ్ లోకి దిగితే విధ్వంసమే: ఇంగ్లాండ్ దిగ్గజం

సాధారణంగా క్రికెట్ లో సుదీర్ఘ కాలం కొనసాగిన ప్లేయర్లకు రాని పేరు, క్రేజ్.. కొందరికి మాత్రం అతి తక్కువ కాలంలోనే వస్తుంది. తమదైన ఆటతీరుతో సదరు ఆటగాళ్లు గ్రౌండ్ లో సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. దీంతో తక్కువ టైమ్ లోనే వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి ప్లేయర్లు టీమిండియాలో చాలా మంది ఉన్నారు. అందులో ఒక ఆటగాడిపై ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్లేయర్ నాసిర్ హుస్సేన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో ఆ ఆటగాడు బాక్సాఫీస్ ప్లేయర్. అతడు బ్యాటింగ్ కు దిగితే.. గ్రౌండ్ లో పెను విధ్వంసమే అంటూ కితాబిచ్చాడు. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపించాడు. 2022 డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ప్రస్తుతం ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. త్వరలోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో కలిసి టెన్నిస్ ఆడి అభిమానులకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్, రిషబ్ పంత్ గురించి ఈ విధంగా మాట్లాడాడు..

“రిషబ్ పంత్ గాయానికి ముందు కూడా బాక్సాఫీస్ క్రికెటరే. అతడు గ్రౌండ్ లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. పంత్ మైదానంలో సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పంత్ గాయం తర్వాత కూడా బాక్సాఫీస్ క్రికెటరే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పంత్ కు గాయం అయినప్పుడు ప్రపంచ క్రికెట్ మెుత్తం ఆందోళన చెందింది. ప్రస్తుతం పంత్ అద్భుతంగా కోలుకున్నాడు. అతడు ఎప్పటికీ బాక్సాఫీస్ క్రికెటరే” అంటూ కితాబిచ్చాడు నాసిర్ హుస్సేన్.

ఇక రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ను తాను అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నానని, పంత్ త్వరలోనే గ్రౌండ్ లోకా అడుగుపెడతాడని పాంటింగ్ చెప్పినట్లు నాసిర్ హుస్సేన్ తెలిపాడు. ఓవరాల్ గా ఈ సంవత్సరం పంత్ బాక్సాఫీస్ క్రికెటర్ గా ఎదుగుతాడని బల్లగుద్ది చెప్పాడు ఈ దిగ్గజ క్రికెటర్. ఇదిలా ఉండగా.. ఫ్యూచర్ లో శుబ్ మన్ గిల్, రచిన్ రవీంద్రలు ప్రపంచ క్రికెట్ లో సరికొత్త ప్లేయర్లుగా అవతరిస్తారని జోస్యం చెప్పాడు. మరి రిషబ్ పంత్ ను నాసిర్ హుస్సేన్ ప్రశంసల్లో ముంచెత్తడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి