iDreamPost

ఢిల్లీని వీడిన సోనియా గాంధీ.. మరో ప్రాంతానికి మార్చిన మకాం

ఇటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు.. అటు అనారోగ్య సమస్యలు వెరసి.. సోనియా గాంధీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు ఆమెకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఇక ఢిల్లీలో ఉండలేక.. మరో ప్రాంతానికి మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు.. అటు అనారోగ్య సమస్యలు వెరసి.. సోనియా గాంధీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు ఆమెకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఇక ఢిల్లీలో ఉండలేక.. మరో ప్రాంతానికి మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీని వీడిన సోనియా గాంధీ.. మరో ప్రాంతానికి మార్చిన మకాం

ఢిల్లీలో వాయు కాలుష్యం రానూ రానూ దిగజారిపోతుంది. గాలి నాణ్యత పేలవమైన కేటగిరికి పడిపయింది. తీవ్రమైన పొగ మంచుతో అక్కడి ప్రజలు సతమతమౌతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో వాయు నాణ్యత కాస్త మెరుగుపడింది అనుకునేలోపు.. దీపావళి పండుగ కుంపటి తెచ్చిపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఢిల్లీ వాసులు టపాసులు కాల్చడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. దేశ రాజధాని నగరిలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అత్యున్నత న్యాయస్థానం పటాసులు పేల్చవద్దని చెప్పినా.. వినకుండా అర్థరాత్రి వరకు కాల్చి.. నగరాన్ని కలుషితం చేసేశారు. దీంతో మరుసటి రోజు గాలి నాణ్యత క్షీణించింది. అయితే దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయి.

ఈ వాయు కాలుష్యం సామాన్యులపైనే కాదూ.. సెలబ్రిటీలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కాలుష్య కోరల దెబ్బకు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఏకంగా మకాం మార్చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈ వాయు కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. రెండు నెలల కిందటే ఆమె శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతూ.. గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నందున.. ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయని.. ఇక్కడ ఉండటం మంచిది కాదని వైద్యులు సూచించారని తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు మకాం మార్చారని సమాచారం. గాలి నాణ్యత మెరుగుపడే వరకు తాత్కాళికంగా జైపూర్‌లో ఉండనున్నారు. మంగళవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 375గా ఉంది. అంటే ఇది తీవ్రమైన కేటగిరిలో ఉంది. జైపూర్‌లో అయితే ఏఐ 72గా చూపిస్తోంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ర్యాలీల్లో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి జైపూర్ కు వచ్చి తల్లిని కలిసే అవకాశాలున్నాయి. సెలబ్రిటీ, రాజకీయ నేతల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుడికి ఈ వాయు కాలుష్యం కారణంగా చుక్కలు కనిపిస్తున్నట్లు ఉన్నాయి రాజధాని నగరం హస్తినలో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి