iDreamPost

లోకేశ్ కోసం.. Jr. NTR ను నాశనం చేయాలనుకుంటున్నారు : కొడాలి నాని

నందమూరి కుటుంబంలో చిచ్చు రాజుకుందన్న వార్త ఎప్పటి నుండో హల్ చల్ చేస్తోంది. ఆ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. పెద్దాయన (సీనియర్ ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా మరోసారి ఆ పొరపచ్ఛాలు బయటపడ్డాయి.. ఇంతకు ఏమైందంటే..?

నందమూరి కుటుంబంలో చిచ్చు రాజుకుందన్న వార్త ఎప్పటి నుండో హల్ చల్ చేస్తోంది. ఆ వార్తలకు బలం చేకూర్చినట్లయ్యింది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. పెద్దాయన (సీనియర్ ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా మరోసారి ఆ పొరపచ్ఛాలు బయటపడ్డాయి.. ఇంతకు ఏమైందంటే..?

లోకేశ్ కోసం.. Jr. NTR ను నాశనం చేయాలనుకుంటున్నారు : కొడాలి నాని

తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ప్రజలు ఆత్మ గౌరవాన్ని దశ దిశలా చాటి చెప్పిన గొప్ప నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎంతో ఖ్యాతిని పొందారు. ఆయన నుండి వచ్చిన వారసులు ఎంతో మంది ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే ఈ నెల 18న సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా నివాళులు అర్పించారు. తొలుత ఎన్టీఆర్ మనవళ్లు, నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాత సమాధి వద్దకు చేరుకుని, పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అప్పటికే పెద్ద యెత్తున టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకోవడంతో సందడి నెలకొంది.  తారక్ ఫ్లెక్సీలు కట్టి.. సీఎం సీఎం అంటూ నినదించారు. అయితే అవేమీ పట్టించుకోలేదు తారక్.

నివాళులు అర్పించి.. అక్కడ నుండి వెళ్లిపోయారు తారక్, కళ్యాణ్ రామ్. ఆ తర్వాత నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులతో సహా ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకున్నారు. కారు దిగగానే.. అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ.. అక్కడే ఉన్న టీడీపీ నేతలకు కన్ను ఎగరేసి మరీ చెప్పారు.. వాటిని తొలగించాలని, అదీ కూడా ఇప్పుడే..తీయించేయ్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఉన్న పళంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ నుండి తీసేసి.. తరలించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింటిని షేక్ చేయడమే కాదూ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా షాక్ కు గురి చేశాయి. పరిస్థితులు టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న చందంగా మారిపోయాయి. కొన్ని రోజుల నుండి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య మాటలు లేవని, వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వార్తలు రావడంతో.. ఇప్పుడు ఈ చర్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వల్ల ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ల నీచాతి నీచ బుద్ది బయట పెట్టుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి భజన చేసుకుంటున్న కుటుంబ సభ్యులు.. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్ర బాబు కోసం దించారు. అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ .. జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలు, చంద్రబాబులు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్థంతి చేస్తారా’.. అంటూ ప్రశ్నలు సంధించారు.  టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్టుపై తారక్, కళ్యాణ్ రామ్ స్పందించకపోవడంతో మొదలైన ఈ వార్..  ఇప్పుడు బాలకృష్ణ చేసిన చర్యలతో  ఎంత వరకు దారి తీస్తాయో తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి