iDreamPost

షర్టు విప్పేసి స్టేడియంలో చక్కర్లు… గెలుపును ఇలా సెలెబ్రేట్ చేసుకున్న ఇంగ్లండ్ మహిళా ఫుట్ బాల్ ప్లేయర్

షర్టు విప్పేసి స్టేడియంలో చక్కర్లు… గెలుపును ఇలా సెలెబ్రేట్ చేసుకున్న ఇంగ్లండ్ మహిళా ఫుట్ బాల్ ప్లేయర్

ఒక మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ ఫొటో ఈ దశాబ్దానికే గొప్ప “ఫెమినిస్ట్ ఇమేజ్” అని ప్రశంసలందుకుంటోంది. 24 ఏళ్ళ ఇంగ్లాండ్ ఫుట్ బాల్ ప్లేయర్ క్లోయి కెల్లీ ఫొటో ఇది. జర్మనీతో ఫైనల్ మ్యాచ్ లో గెలవగానే క్లోయీ ఆనందంతో షర్టు విప్పేసి గాల్లో తిప్పింది. ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. మహిళా అథ్లెట్ చిత్రాల్లో ఇది ఒక ఐకన్ (icon)గా నిలిచిపోతుందని న్యూయార్క్ టైమ్స్ పొగడ్తల వర్షం కురిపించింది.

యూరో 2022 ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ నేషనల్ ఫుట్ బాల్ టీమ్, జర్మనీ మధ్య హోరాహోరీ జరిగింది. చివరికి ఇంగ్లండ్ లయనెసెస్ (England Lionesses) ఎక్స్ట్రా టైమ్ లో గోల్ కొట్టి గెలిచారు. క్లోయీ కెల్లీ కప్ గెలిచిన ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. షర్ట్ విప్పేసి గాల్లో తిప్పుతూ స్పోర్ట్స్ బ్రాలోనే స్టేడియం అంతా కేకలు పెడుతూ తిరిగింది. దీనికి సంబంధించిన ఫోటో ట్విట్టర్ ని కుదిపేసింది. కొన్ని కోట్ల మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఈ ఫొటో ఒకేసారి చాలా స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేసింది. మగవాళ్ళ ఆటగా పేరు పడిన ఫుట్ బాల్ గేమ్ లో ఆడవాళ్ళు కూడా సత్తా చాటగలరనడానికి ఇది ప్రతీక. మహిళల శరీరంపై వాళ్ళకే హక్కుందనడానికీ ఇది నిదర్శనం. ఆడవాళ్ళు విజేతలుగా నిలవగలరనడానికీ ఈ ఫొటో ఒక మచ్చుతునక. తమతో పాటు చిన్న పిల్లలు కూడా దీన్నుంచి స్ఫూర్తి పొందుతున్నట్లు ఈ తరం అమ్మాయిలు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా మహిళల ఫుట్ బాల్ కి గుర్తింపు వచ్చిందని కొందరు సంతోషం వ్యక్తం చేశారు.

1999లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో తమ టీం గెలిచినపుడు అమెరికన్ ఫుట్ బాల్ ప్లేయర్ బ్రాండీ చెస్టెయిన్ కూడా ఇలాగే షర్టు విప్పేసి గెలుపును సెలెబ్రేట్ చేసుకుంది. ఈ విజయం కెల్లీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుందని చెస్టెయిన్ ట్వీట్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి