iDreamPost

Fogg యాడ్‌లో కనిపించే ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా? చాలా ఫేమస్!

ప్రకటనలందు.. ఈ యాడ్ వేరయ్యా అన్నట్లు ఉంటుంది ఫాగ్. చాలా కొత్త కాన్సెప్టుతో తెరకెక్కిస్తూ ఉంటారు. అబ్బాయి ఫెర్ఫ్యూమ్ కొట్టుకోగానే.. అమ్మాయిలు ఒక్కసారిగా చుట్టుముట్టేసినట్లు చూపిస్తుంటారు. ఏం నడుస్తుంది అంటూ ఓ అంకుల్ అడగ్గానే.. ఫాగ్ అంటాడో కుర్రాడు. అలాంటి ప్రకటనలు ఎన్నో. ఇదిగో ఆ కోవలోకో వస్తుంది ఈ అడ్వర్టైజ్‌మెంట్ కూడా. ఇందులో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

ప్రకటనలందు.. ఈ యాడ్ వేరయ్యా అన్నట్లు ఉంటుంది ఫాగ్. చాలా కొత్త కాన్సెప్టుతో తెరకెక్కిస్తూ ఉంటారు. అబ్బాయి ఫెర్ఫ్యూమ్ కొట్టుకోగానే.. అమ్మాయిలు ఒక్కసారిగా చుట్టుముట్టేసినట్లు చూపిస్తుంటారు. ఏం నడుస్తుంది అంటూ ఓ అంకుల్ అడగ్గానే.. ఫాగ్ అంటాడో కుర్రాడు. అలాంటి ప్రకటనలు ఎన్నో. ఇదిగో ఆ కోవలోకో వస్తుంది ఈ అడ్వర్టైజ్‌మెంట్ కూడా. ఇందులో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Fogg యాడ్‌లో కనిపించే ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా? చాలా ఫేమస్!

కొత్త ప్రొడక్ట్ తయారు అవుతుందంటే.. దాని మార్కెట్ చాలా ముఖ్యం. అందుకే ఉత్పత్తి చేసి సంస్థలు ముందుగా ఆశ్రయించేది ఆకర్షణీయమైన ప్రకటనల వైపే. అడ్వర్టైజ్‌మెంట్ చూసి ప్రొడక్ట్ కొంటున్నారు కస్టమర్ల రూపంలో ఉన్న ప్రజలు. అందుకే కస్టమర్లే దేవుళ్లు అన్న పదం వచ్చింది. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ నిర్మా యాడ్ చేస్తే.. ఓనిడా టీవీ ప్రకటనలో రెండు కొమ్ములతో భయపెట్టాడో మోడల్.  అంతేనా.. నాలుగు చుక్కల ఉజాలా ఆహా అంటూ బట్టలకు పెట్టే బ్లూ డబ్బా సేల్స్ కోసం మహిళలన్ని టార్గెట్ చేశారు, అందమైన అమ్మాయికి బికినీ వేసి లిరిల్ యాడ్ చేస్తే.. ఎగబడి కొన్నారు జనాలు. మీ పేస్టులో ఉప్పు ఉందా అంటూ ఇంట్లోకి దూసుకొచ్చారు. కిస్ మీ అంటూ క్యాడ్బరీ ఊరించింది. ఇలా ఎన్నో ప్రకటనలు అలరించాయి.

అయితే ఓ యాడ్ మాత్రం.. విపరీతంగా ఆకట్టుకోవడమే కాదూ, విమర్శల పాలయ్యింది. అదే ఫాగ్ బాడీ స్ప్రే యాడ్. ఇలా ఓ అబ్బాయి వచ్చి ఫాగ్ ఫెర్ఫ్యూమ్ కొట్టుకోగానే.. అమ్మాయిలు ఒక్కసారిగా ఎగబడిపోతుంటారు. అంటే అమ్మాయిలు అంత వీకా అంటూ మహిళా సంఘాలు కూడా తిట్టిపోశాయి. కానీ ప్రకటనలు మార్చిందే కానీ.. యాడ్స్ చేయడం ఆపలేదు విని కాస్మోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ సంస్థ ప్రొడక్టే ఫాగ్). బాడీకెంతో రాశామయ్యా..ఎంతో గ్యాస్ పోయిందయ్యా అంటూ సాంగ్ క్రియేట్ చేసి మార్కెట్ చేసుకుంది సదరు సంస్థ. ఏం నడుస్తోంది అంటే.. ఫాగ్ నడుస్తుందని, అలాగే ఈ ఫెర్ఫ్యూమ్ వాడగానే స్ట్రోమ్ వచ్చినట్లు చూపించాడు. అదిగో అలాంటిదే ఈ అడ్వర్టైజ్‌మెంట్.

ఓ బస్టాఫ్‌లో నుంచొన్న అమ్మాయి, అబ్బాయి ఊహించిన విధంగా తుఫాన్ దాడిని ఎదుర్కొంటారు. అందులో అమ్మాయి తప్పించుకుని అక్కడే ఉన్న ఓ గదిలోకి వెళుతుంది. కానీ అతడు మాత్రం అలాగే బయటే ఉండిపోతాడు. ఆ తుఫాను అతని  ఒంటిమీదున్న షర్ట్ సైతం చినిగిపోతుంది. తుఫాన్ ఆగాక బయటకు వచ్చిన ఆ అమ్మాయి.. అతడు వద్ద వచ్చే ఫెర్ప్యూమ్ వాసనకు నైస్ ఫ్రాగెన్స్ అంటూ వెళ్లిపోతుంది. అందులో నటించిన బ్యూటీ ఎవరో తెలుసా.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..? ఆ బ్యూటీ పేరు అంగీరా ధర్. ఆమె మోడల్ కమ్ యాంకర్ కమ్ యాక్టర్. కాశ్మీర్ తల్లిదండ్రులకు పుట్టిన అంగీరా ముంబయిలో పెరిగింది. ప్రముఖ చానల్ విలో చేసింది. ఆమె అక్కడ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌గా కూడా వర్క్ చేసింది. ఆ తర్వాత బిందాస్ ఛానల్లోకి వెళ్లి.. హోస్టుగా ఆకట్టుకుంది.

ఫాగ్ కాకుండా ఆమె క్యార్బరీ వంటి యాడ్స్ కూడా చేసింది. 2013లో నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఏక్ బార్ ఆద్మీ అనే చిత్రంతో తెరకు పరిచమైన అంత గుర్తింపు దక్కలేదు. బ్యాంగ్ బ్యాంగ్ బారాత్ ఆమెను నటిగా నిలబెట్టాయి. ఆ తర్వాత లవ్ పర్ స్క్వేర్ ఫుట్, కమాండో 3లో నటించింది. అజయ్ దేవగన్ నటించిన రన్ 34లో కీలక పాత్ర పోషించింది. గత ఏడాది సాస్, బహు ఔర్ ఫ్లమింగో వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. 2021లో ఆనంద్ తివారీ వ్యక్తిని మనువాడింది. అతడు యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు ఆమె మా కా సుమ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది కూడా ఓటీటీ మూవీ అన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి