iDreamPost

IND vs AFG: రెండో టీ20లో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

ఆఫ్గానిస్తాత్ జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం పదండి.

ఆఫ్గానిస్తాత్ జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం పదండి.

IND vs AFG: రెండో టీ20లో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!

టీమిండియా యంగ్ ప్లేయర్లు యశస్వీ జైస్వాల్, శివమ్ దుబే చెలరేగిన వేళ.. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో మాదిరిగానే ఈ పోరులో కూడా ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత జట్టు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఆఫ్గాన్ బౌలర్లను చితకొట్టారు జైస్వాల్, దుబే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం పదండి.

టీమిండియా విజయం 5 ప్రధాన కారణాలు

1. అక్షర్ పటేల్ స్పెల్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ జట్టు.. ఆరంభంలో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. దీంతో 5 ఓవర్లకే 50/1తో నిలిచింది. మెుదట్లో ముకేశ్, రవి బిష్ణోయ్ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా గుల్బాదిన్ నైబ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముకేశ్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నైబ్.. ఆ తర్వాత బిష్ణోయ్ వేసిన ఓవర్లో వరుసగా 6, 4, 4తో విజృంభించాడు. ఈ దశలో అక్షర్ బౌలింగ్ కు వచ్చి ఆఫ్గాన్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. తన తొలి రెండు ఓవర్ల స్పెల్ లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఇబ్రహీం జద్రాన్(8)ను బోల్తా కొట్టించాడు. దీంతో ఆఫ్గాన్ జోరుకు బ్రేకులు పడ్డాయి. అక్షర్ ఇచ్చిన బూస్ట్ తో మిగతా బౌలర్లు కూడా స్వింగ్ లోకి వచ్చి.. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే నైబ్ మాత్రం తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మరోసారి భారత్ కు నైబ్ ను అవుట్ చేయడం ద్వారా బ్రేక్ త్రూ అందించాడు అక్షర్. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు కీలక వికెట్లు పడగొట్టాడు అక్షర్.

2. టీమిండియా ఫీల్డింగ్

ఆఫ్గానిస్తాన్ జరిగిన 2వ టీ20లో టీమిండియా ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. తొలుత భారత బౌలర్లు లయ తప్పడంతో.. ఆఫ్గాన్ బ్యాటర్లు భారీగానే పరుగులు పిండుకున్నారు. అయితే ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో పాటుగా భారత ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ పోరులో అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు భారత ప్లేయర్లు. గ్రౌండ్ లో చిరుత పులుల్లా కదులుతూ.. పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. క్యాచ్ ల విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు. కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేయడంతో.. ఆఫ్గాన్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి కష్టపడ్డారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ అద్భుతమనే చెప్పాలి, జట్టు విజయానికి ఇది కూడా ప్రధాన కారణం.

3. కోహ్లి- జైస్వాల్ పార్టనర్ షిప్

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఇన్నింగ్స్ తొలి బంతికే షాకిచ్చాడు ఫజల్ హక్ ఫారూఖీ. అద్భుతమైన బంతితో కెప్టెన్ రోహిత్ శర్మను ఫస్ట్ బాల్ కే బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో నిశ్శబ్దం. తొలి మ్యాచ్ లో దురదృష్టవశాత్తు రనౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్ లోనూ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియాపై భారీ ఒత్తిడి ఏర్పడింది. ఈ క్రమంలోనే దాదాపు 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్ లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. క్రీజ్ లోకి వచ్చాడు. లాంగ్ గ్యాప్ వచ్చినా కూడా చకచకా బౌండరీలు బాది దూకుడు ప్రదర్శించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. మరో వైపు యశస్వీ తనదైన బ్యాటింగ్ తో చెలరేగాడు. వీరిద్దరు ఆఫ్గాన్ బౌలర్లను దంచికొట్టారు. రెండో వికెట్ కు ఈ జోడీ కేవలం 28 బంతుల్లోనే 57 పరుగులు జోడించి.. విజయానికి బాటలు వేసింది. ఫస్ట్ బాల్ కే వికెట్ కోల్పోయి, ఒత్తిడిలో ఉన్న భారత్ కు అద్భుతమైన పార్ట్ నర్ షిప్ ను అందించారు కోహ్లీ-జైస్వాల్ జోడీ. మ్యాచ్ లో విజయానికి ఇది కీలక పరిణామం.

4. జైస్వాల్ బ్యాటింగ్

తొలి మ్యాచ్ లో అవకాశం దక్కించుకోలేకపోయిన యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. ఆఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కోహ్లీ, దుబేలతో విలువైన భాగస్వామ్యాలను నిర్మించి.. టీమిండియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో యశస్వీ మామూలుగా రెచ్చిపోలేదు. ఫారూఖీ వేసిన ఓ ఓవర్లో కళ్లు జిగేల్ అనే రీతిలో రెండు సిక్సులు కొట్టిన తీరు చూసితీరాల్సిందే. ఇక ఆ తర్వాత సీనియర్ బౌలర్ ముజీబ్ ను సైతం శిక్షించాడు ఈ కుర్ర బ్యాటర్. అతడి బౌలింగ్ లో వరుసగా మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 5 ఫోర్లు,6 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా జైస్వాల్ తన బ్యాటింగ్ తో భారత్ కు విజయాన్ని అందించాడు.

5. శివమ్ దూబె బ్యాటింగ్

శివమ్ దూబె.. ప్రస్తుతం టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు. తొలి మ్యాచ్ లో 60 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించగా.. ఈ మ్యాచ్ లో సైతం అదే దూకుడును కొనసాగించాడు. స్టార్ ఆల్ రౌండర్ గా జట్టులోకి దూసుకొచ్చిన దూబె, అంతే అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ బౌలర్లను ఊచకోతకోశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేశాడు దూబె. తొలుత నూర్ బౌలింగ్ లో సిక్స్ తో తన విధ్వంసం స్టార్ట్ చేసిన అతడు.. ఆ తర్వాత సీనియర్ బౌలర్ నబీకి 6, 6, 6 లతో చుక్కలు చూపాడు. దీంతో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబే.. మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. దూబె బ్యాటింగ్ ధాటికి 173 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లు మిగిలుండగానే ఊదేసింది. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 63 రన్స్ తో అజేయంగా నిలచి.. టీమిండియాకు సిరీస్ విజయాన్ని అందించాడు. మరి టీమిండియా సాధించిన అద్భుత విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి