iDreamPost

వేసవి దెబ్బ స్టార్ట్..రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

ఎండలు బాబోయ్ ఎండలు.. అంటున్నారు అప్పుడే ప్రజలు. ఇలా సమ్మర్ సీజన్ స్టార్ అయ్యిందో లేదో.. అప్పుడు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం ఠంచనుగా డ్యూటీ ఎక్కేస్తున్నాడు సూరీడు. ఈ ఎండల ధాటికి

ఎండలు బాబోయ్ ఎండలు.. అంటున్నారు అప్పుడే ప్రజలు. ఇలా సమ్మర్ సీజన్ స్టార్ అయ్యిందో లేదో.. అప్పుడు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం ఠంచనుగా డ్యూటీ ఎక్కేస్తున్నాడు సూరీడు. ఈ ఎండల ధాటికి

వేసవి దెబ్బ స్టార్ట్..రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

మార్చి నెల ఇలా మొదలైందో లేదో సూరీడు ఎండాకాలం వచ్చేసిందని గుర్తు చేసేశాడు. చలికాలానికి గుడ్ బై చెప్పిన ప్రజలు.. వేసవికి వెల్కమ్ పలికారు. ఉదయం 9 నుండే భానుడు భగభగ మండిపోతున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఎండలు ముదురుతున్నాయి.  కాస్త నడిచినా కూడా చెమటలు పట్టేస్తున్నాయి. ఇక సమ్మర్ కష్టాలు స్టార్ అయ్యాయి. ఏసీలకు, ఫ్రిజ్‌లకు పని పడినట్లే.. వస్తువులన్నీ వేడెక్కుతున్నాయి. ఇక వాహనాల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ ఎండల ధాటికి వాహనాలు కూడా తగులబడిన దాఖలాలు ఉన్నాయి.  తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ వాహనంలో మంటలు చెలరేగాయి.

మొన్న లక్డీ కపూల్ ప్రాంతంలో ఓ వాహనంలో మంటలు చెలరేగగా.. తాాజాగా చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ పెట్రోల బంక్ ముందు కారు తగులబడిపోయింది. ఉన్నట్టుండి కారులో మంటలు చెలరేగడంతో.. అప్రమత్తమైన ప్రయాణీకులు వెంటనే కారు నుండి దిగి పోయారు. కారులో మంటలు అలముకుని.. దట్టమైన పొగలు వ్యాపించి.. చూస్తుండగానే పూర్తిగా కాలిపోయింది. ఈ విషయంపై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం వెళ్లగానే.. హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి జేసీబీ సాయంతో అక్కడి నుండి తరలించారు. పెట్రోల్ బంక్ సమీపాన ఈ ఘటన జరగడం గమనార్హం. మంటలు మరింత చెలరేగితే.. పెను ప్రమాదమే జరిగేది.

సమ్మర్ రావడం ఆలస్యం రోడ్లే కాదూ ఇంట్లో ఉన్న గచ్చు కూడా ఠారేత్తిస్తుంది. ఇంటి గోడలు సైతం అట్టుకుంటే సర్రుమంటాయి. ఇక వస్తువుల సంగతి చెప్పనక్కర్లేదు. చెప్పులు లేకుండా అర సెకను కూడా ఎండలో ఉండలేని పరిస్థితి. ఈ సారి కూడా ఎండలు తీవ్రంగా ఉండవచ్చునన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వానలు పలకరించినా.. అది కాస్త ఉపశమనం మాత్రమే. ఎండలు ముదరకుండానే.. ఇప్పుడు వాహనాలు ఇలా మండిపోతుంటే.. ఇక 40 నుండి 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరితే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. వాహనదారుల్లో కూడా ఇదే ఆందోళన ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిందని సూచిస్తున్నారు కొందరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి