iDreamPost

యువ రైతు అద్భుతం! ఈ పంటతో ధనవంతులు కావచ్చు!

నేటికాలంలో దేశంలో సంప్రదాయ పంటలను పండించడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా లేదు. ఈ క్రమంలో చాలా మంది పట్టు ఉత్పత్తి వైపు మొగ్గు చూపగా, మరికొందరు ఆపిల్ మరియు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచ ఆదాయాలు పొందుతున్నారు.

నేటికాలంలో దేశంలో సంప్రదాయ పంటలను పండించడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా లేదు. ఈ క్రమంలో చాలా మంది పట్టు ఉత్పత్తి వైపు మొగ్గు చూపగా, మరికొందరు ఆపిల్ మరియు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచ ఆదాయాలు పొందుతున్నారు.

యువ రైతు అద్భుతం! ఈ పంటతో ధనవంతులు కావచ్చు!

ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు. బాగా డబ్బులు సంపాదించి ధనవంతులుగా స్థిరపడాలని కోరుకుంటారు. అందుకోసం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే వ్యవసాయన్ని ఎంచుకుంటారు. అయితే సరైన విధానంలో, సరైన పంటను పండిస్తే.. రైతులు కూడా భారీ ఆదాయం పొంద వచ్చు. ఆ విషయాన్ని ఎందరో నిజం చేసి చూపించారు. తాజాగా ఓ యువ రైతు అందరికి ఆదర్శంగా నిలిచాడు. అందరికి భిన్నంగా  వెరైటీ పంటను వేసి..లక్షల ఆదాయం పొందుతున్నాడు. మరి.. రైతు  ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా  ఎక్కువ మంది యువత మంచి కంపెనీలో, మంచి జీతానికి ఉద్యోగం చేయాలని భావిస్తుంది. మరికొందరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని భావిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వ్యవసాయంతో విజయం సాధించాలని భావిస్తుంటారు. ఆ కోవాకి చెందిన యువ రైతే రాహుల్ ఖోస్. మహారాష్ట్ర లోని జల్నా జిల్లా మచిందర్ నాథ్  చించోలికి చెందిన రాహుల్ ఖోస్ కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అయితే అందురు చేస్తున్నట్లు సంప్రదాయ పంటలు అయిన వరి, గోధుమతో ఆశించిన ఆదాయం రావడం లేదని గ్రహించాడు. అందుకే  ఏదైనా పండ్లను పండించాలని భావించాడు  క్రమంలోనే అంజూర పంట సాగు చేసి ఎకరాకు రూ.5 నుంచి 6 లక్షల వరకు సంపాదించవచ్చాడు. ఇదే విషయాన్ని రాహుల్ ఖోస్ స్వయంగా వెల్లడించారు. రాహుల్ తొలిసారి అంజూర సాగు చేసి మొదటి ఏడాది రూ.1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఆదాయం పొందాడు.

yound farmer sensation earning in lakhs

అంజూర పండ్ల అమ్మకాలను కూడా రాహుల్ చాలా బాగా నిర్వహించారు.  ప్రస్తుతం లక్ష నుంచి లక్షన్నర మధ్య ఆదాయం వస్తుందని భవిష్యత్తులో రూ.5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఈ యువ రైతు అంచనా వేస్తున్నారు. ఈ అంజూర పండునే అత్తి పండు అని కూడా పిలుస్తుంటారు. అంజూరపు సాగును ఉపయోగించడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఈ యువ రైతు నిరూపించాడు. రాహుల్  2021లో  అంజూరపు చెట్లను నాటాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఎకరాకు 12 వెడల్పు 15పొడవు చొప్పున 230 మొక్కలు నాటారు. ఇందుకోసం ముందుగా జేసీబీతో నిర్థిష్టమైన కొలతలతో గుంతలు తవ్వారు.

ఆ గుంతల్లో పాల-పచోలా, కుళ్లిన ఆవు పేడ వంటి సేంద్రియ ఎరువులు వేసి అంజూర చెట్లు నాటారు. మొదట్లో ఎరువుల్లో10 కిలోల ఆవుపేడను, 10 కిలోల ఎరువు,5 కిలోల వర్మీకంపోస్ట్‌లో చెట్లకు వేసేవారు. దీంతో అతనికి పెట్టుబడి కింద రూ.60 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు అయింది. ఇలానే వ్యవసాయ శాస్త్రవేత్త సలహా తీసుకుని అత్తి పండ్లను సాగు చేశాడు. తొలి రెండేళ్లలో అతను అంజూర పంటతో పాటు సోయాబీన్ పండించడం ద్వారా పెట్టుబడులు తీరారు. ప్రస్తుతం రాహుల్ ఖోస్ అంజూర మొక్కల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఇక అంజూర్ మొక్క గురించి చెప్పాలంటే.. ఇది ఒక ప్రత్యేకమైన పండు. ఇది ఆరోగ్యానికి చాలా మంది. అందుకే దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈక్రమంలో ఈ పంటకు కూడా మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. అలానే అత్తి పండ్లను నుంచి జామ్ తయారు చేయవచ్చు. అత్తి పండ్లను సమశీతోష్ణ, పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తారు. నాలుగైదు ఏళ్ల వయస్సు గల చెట్టు నుండి దాదాపు 15 కిలోల పండ్లు లభిస్తాయి. పూర్తిగా ఎదిగిన చెట్టు ఒక్కసారిగా రూ.1 లక్షా 20 వేల వరకు లాభం పొందగలదు. అలానే యువ రైతు అంజూర పండ్ల ద్వారా తొలి ఏడాది రూ.1 నుంచి 1.5 లక్షల వరకు సంపాదించారు.

అయితే దళారులకు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతుందని రాహుల్ గుర్తించాడు. అందుకే మంచి ధర పొందడానికి నేరుగా వ్యాపారులకు విక్రయించకుండా తానే స్వయం అమ్మడం ప్రారంభించాడు. అంబాద్, కుంభార్ పింపాల్‌గావ్ రోడ్‌లో సొంతంగా స్టాల్‌ను ఏర్పాటు చేసి అమ్ముతున్నట్లు రాహుల్ ఖోస్ తెలిపారు. దేశంలో సంప్రదాయ వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతుల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఇలాంటి తరుణంలో ఈ యువత రైతు చేసిన అద్భుతం మిగతా రైతులకు కూడా ఆదర్శంగా ఉంటుంది. మరి..  అంజూర పంట సాగుపై, యువ రైతు అద్భుతం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి