iDreamPost

అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు.. రామయ్యపై భక్తితో!

  • Published Jan 23, 2024 | 12:57 PMUpdated Jan 23, 2024 | 2:00 PM

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్బంగా దేశమంతటా సందడి వాతావరణం నెలకొంటే.. ఆరోజున ప్రత్యేకమైన రోజుగా భావించి కొంతమంది గర్భిణీలు తమ బిడ్డలకు జన్మనివ్వాలని తపించిపోయారు.

అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్బంగా దేశమంతటా సందడి వాతావరణం నెలకొంటే.. ఆరోజున ప్రత్యేకమైన రోజుగా భావించి కొంతమంది గర్భిణీలు తమ బిడ్డలకు జన్మనివ్వాలని తపించిపోయారు.

  • Published Jan 23, 2024 | 12:57 PMUpdated Jan 23, 2024 | 2:00 PM
అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు.. రామయ్యపై భక్తితో!

అయోధ్య రామ మందిర ఘట్టం భారతదేశ చరిత్రలో ఓ అద్భుతమైన అధ్యాయం. అందులో జనవరి 22వ తారీకు ప్రత్యేకమైన పేజీగా లికించబడిందని చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ రోజునే రామ జన్మ భూమి అయిన అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేయబడింది. ఇక నుంచి ఈ రాముడు అయోధ్య నందన వనంలో హాయిగా భక్తులను దీవించనున్నాడు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన రోజును దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంది. తమ ఇంట్లోనే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందా అన్నంత వైభవంగా అందరి ఇల్లలో సందడి నెలకొంది. మరి, బాల రాముడు తన జన్మ స్థానంలో కొలువుతీరే సమయం ఎంతో అరుదైనదిగా భావించి.. తమ ఇంట్లోకి కూడా చంటి బిడ్డలను ఆహ్వానించాలని.. పట్టుపట్టి మరి కొంతమంది గర్భిణిలు అదే సమయంలో ప్రసవాలకు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఆ బిడ్డకు రాముడు పేరు పెట్టుకుని మురిసిపోయింది. ఇలా ఎంతో మంది గర్భిణిలు జనవరి 22వ తేదీన ప్రసవించిన తమ బిడ్డలకు రాముడు, సీత పేరులు వచ్చేలా నామకరణం చేయించుకున్నారు.

ఓ వైపు బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవం.. మరో వైపు తమ ఇంటికే ఆ బాల రాముడిని తమ బిడ్డల రూపంలో.. సరిగ్గా అదే సమయానికి ఆహ్వానించాలనే తపన. ఇలా కేవలం నిన్న ఒక్కరోజే ఎంతో మంది మాతృ మూర్తులు తహతహలాడరు. చివరికి పట్టుబట్టి సాధించి ప్రసవాలు జరిపించుకున్నారు. కొందరు సాధారణం డెలివెరీలు కాగా.. మరికొంతమంది అదే ముహూర్తానికి ఆపరేషన్ చేయించుకుని మరీ.. పండంటి బిడ్డలకు జన్మను ఇచ్చారు ఈ మాతృ మూర్తులు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళ.. సోమవారం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుట్టిన బిడ్డకు హిందూ , ముస్లిమ్ మతాల పేరులు కలిసి వచ్చేలా రామ్ రహీం అని నామకరణం చేసింది. ఇక మహారాష్ట్రలోని థానేకు చెందిన మరో మహిళకు.. డెలివరీ డేట్‌ మంగళవారం ఇవ్వగా.. డాక్టర్లను రిక్వెస్ట్ చేసి.. సోమవారం మధ్యాహ్నం 12.30 కు ఆపరేషన్ చేయించుకుంది.

ఇలా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రసవాలు జరిగినట్లు తెలుస్తోంది. బిహార్‌ రాజధాని పాట్నాలో పలు ఆస్పత్రుల్లో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు వెల్లడించారు. మరోవైపు.. మధ్యప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో ఉన్న వివిధ హాస్పిటల్‌లలో సోమవారం సుమారు 47 మంది పిల్లలు పుట్టినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ గణేశ్‌ శంకర్‌ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని కేవలం 2 ఆస్పత్రుల్లోనే 15 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. అందులో 11 మందివి నార్మల్‌, నలుగురివి సిజేరియన్‌ డెలివరీలు అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వారిలో చాలా మంది తమకు పుట్టిన మగబిడ్డలకు రామ్‌ అని.. ఆడ పిల్లలకు సీత అని పేర్లు పెట్టుకుని మురిసిపోయారు. మరికొంతమంది రాఘవ్‌, రాఘవేంద్ర, రఘు, రామేంద్ర ఇలా ఆ శ్రీరాముల వారి పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్బంగా.. సంబరాలు జరుపుకుంటుంటే.. కొంతమంది మాతృ మూర్తులు మాత్రం తమ ఇళ్లకే బాలలను ఆహ్వానించారు. మరి, ఎంతో ప్రత్యేకమైన రోజున దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జరిగిన ప్రసవాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by C/O.Controversy (@controversyy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి