iDreamPost
android-app
ios-app

‘దోచేవారెవరురా..’లోని ‘కల్లాసు అన్ని వర్రీసూ..’ పాట విడుదల..

‘దోచేవారెవరురా..’లోని ‘కల్లాసు అన్ని వర్రీసూ..’ పాట విడుదల..

ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోచేవారేవారురా!” ఈచిత్రం లోని ” కల్లాసు అన్ని వర్రీసూ.. నువ్వేలే.. నీ బాసూ.. పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేశారు.

కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి రావడం.. సాంగ్ లాంచ్ నేను చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్ రావటానికి నా ఫ్రెండ్ మరియు దర్శకుడు శ్యాం గారు కారణం. నేను కన్నడ చిత్రం నిర్మించాను. దానికి దర్శకుడు శ్యాం గారు అని తెలిపారు.

శివనాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.. మహిళలస్వేచ్ఛ గురించి వచ్చే ఈ పాటను ఈ కాలేజ్ లో విడుదల చేయాలని మలినేని పెరుమాళ్ళు గారిని అడిగాము. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమ గా ..ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని పాటను విడుదల చేసినందుకు చాలా కృతజ్ఞతలు.. విడుదల చేసిన పాటకు ..విద్యార్థిని లకు సింగిగ్ , డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. బాగా పాడిన వాళ్లకు. డాన్స్ చేసిన వాళ్లకు నా నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ ఇస్తాను.. కామెడీ. త్రిల్లర్ తో పూర్తి వినోదం గా సాగే ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. త్వరలో విడుదల తేది ని ప్రకటిస్తామని తెలిపారు.

హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ..ఈ కాలేజ్ లో మీ అందరి సమక్షంలో సాంగ్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది..సినిమా చుస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ కావాలి . అన్నారు ..తదుపరి నంబూరు లో వి.వి.ఐ. టి. కాలేజీ విధ్యర్హినులు . విడుదల చేసిన ఈ చిత్రం లో పాట కు ఆడి.. పాడి అలరించారు.. ఈ పాటకి డాన్స్ లు చేశారు …

నటి నటులు:
ప్రణవచంద్ర..
మాళవిక సతీషన్.. అజయ్ గోష్.. ప్రణతి మనసుపలికే.. బిత్తిరి సత్తి.. మాస్టర్ చక్రి. జెమిని సురేష్.
అతిధి పాత్రలలో కోట శ్రీనివాసరావు.. తనికెళ్ళ భరణి.. బెనర్జీ..

టెక్నీషియన్స్:
బ్యానర్: ఐ క్యూ క్రియేషన్స్
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
దర్శకత్వం: శివనాగేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్: శ్యాం సన్
కెమెరా: గణేష్ ఆర్లి
సాహిత్యం: చైతన్య ప్రసాద్.. సిరా శ్రీ..
మ్యూజిక్: రోహిత్ వర్ధన్. కార్తీక్
పి.ఆర్.ఓ: లక్ష్మీ నివాస్

 

 

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio