iDreamPost

భయపెడుతోన్న వెల్లుల్లి ధర.. రూ. 500లను దాటేసింది

మొన్నటి వరకు టమాటా, ఉల్లి పాయలు కొనాలంటే భయపడ్డ సగటు కుటుంబాలు.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు చూసి అంత కన్నా దిగులు చెందుతున్నాయి. చిన్న పాయే .. సరుకుల కొట్లో రూ. 20 పలుకుతుంటే.. కొనాలంటే ఆందోళన చెందుతున్నారు.

మొన్నటి వరకు టమాటా, ఉల్లి పాయలు కొనాలంటే భయపడ్డ సగటు కుటుంబాలు.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు చూసి అంత కన్నా దిగులు చెందుతున్నాయి. చిన్న పాయే .. సరుకుల కొట్లో రూ. 20 పలుకుతుంటే.. కొనాలంటే ఆందోళన చెందుతున్నారు.

భయపెడుతోన్న వెల్లుల్లి ధర.. రూ. 500లను దాటేసింది

‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగులో నాగన్నా.. ధరలిట్ల మండబెట్టి నాగులో నాగన్నా..ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్నా’ అంటూ ఓ సినిమాలో పాట ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు అచ్చుగుద్దినట్లు ఉన్నాయి. నిత్యావసర సరుకులు ఈ నెల రేట్లు, మరుసటి నెలలో ఉండటం లేదు. సరుకులు తీసుకుందామని వెళితే.. జేబులు ఖాళీ అవుతున్నాయి. సగం బ్యాగ్ కూడా నిండటం లేదు. ఇక కూరగాయాల సంగతి చెప్పనక్కర్లేదు. రోజూ వంటింట్లో వినియోగించే ఉల్లి, టమాటా మొన్నటి వరకు ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించాయి. పోనీ ఈ రెండు మానేద్దామా అంటే.. ఇంటిల్లి పాదికి కూర రావడం కష్టమే. ఒక రోజు రెండు రోజులు అంటే సర్దుకుంటారు కానీ.. నెలల తరబడి అంటే సామాన్యుడు నోరు కట్టుకోవాల్సిందే.

ఇప్పడు ఉల్లి, టమాటా బాటలో నడుస్తోంది వెల్లుల్లి. చికెన్ కూర చేయాలన్నా, ప్రై కూర వండాలన్నా, పప్పు చారు, టమాటా చారు తాళింపు పెట్టాలన్నా, చివరకు పచ్చడి నూరుకోవాలన్నా వెల్లుల్లి లేకపోతే.. రుచే ఉండదు. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబానికి చుక్కలు చూపిస్తుంది. మొన్నటి వరకు కిలో 150 నుండి 200 వరకు ధర పలికిన తెల్లగడ్డ.. కొండనెక్కి కూర్చుంటుంది. రిటైల్‌ మార్కెట్‌లో దీని ధర దాదాపుగా వెయ్యి రూపాయలు పలుకుతుండటం గమనార్హం. ఇక చిల్లర కొట్టు దగ్గరకు వచ్చేసరికి.. ఆ రేటు.. మరింత ఘాటెక్కిస్తోంది. నవంబర్ నుండే వీటి ధరలు పెరుగుతూ వస్తున్నప్పటికీ.. ఫిబ్రవరి నాటికి పీక్స్‌కు చేరుకున్నాయి.

Fearsome price of garlic

ఇది కూడా డిమాండ్.. సప్లై చైన్ కారణంగానే పెరుగుతుంది. వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో పాటు సరఫరా కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో వెల్లుల్లి గడ్డకు డిమాండ్ పెరిగింది. డిసెంబర్‌లో హోల్ సేల్ ధర రూ. 250 నుండి రూ. 300 పలికింది. జనవరికి రూ. 400కు చేరింది. ఇప్పుడు.. హోల్ సేల్ గానే రూ. 500 మార్కును దాటేసింది. ఇక రిటైల్ మార్కెట్‌లో అయితే వెయ్యి రూపాయలకు చేరువగా ఉంది. వెల్లుల్లి సాగు ఖరీఫ్ (వేసవి), రబీ (శీతాకాల)సీజన్లలో జరుగుతుంది. అయితే వర్షాభావం, ఇతర పరిస్థితుల కాణంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ పంట దెబ్బతింది. భారత్ లో వెల్లుల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర వాటా 40 శాతంగా ఉంటుంది. అక్కడ కూడా ఇదే సమస్య రావడంతో.. ఇప్పుడు వెల్లుల్లి పంట దెబ్బతినడంతో ఈ పరిస్థితులు ఎదురౌతున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు ధరలు ఇలాగే ఉండవచ్చునని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి