iDreamPost

17 ఏళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమ పెళ్లి.. తండ్రి ఏం చేశాడంటే?

ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపంగా మారింది. తనకంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆ యువతి తండ్రి ఆమె సోదరుడు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపంగా మారింది. తనకంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆ యువతి తండ్రి ఆమె సోదరుడు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

17 ఏళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో  ప్రేమ పెళ్లి.. తండ్రి ఏం చేశాడంటే?

ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. తనకంటే ఎక్కువ వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆ యువతి తండ్రి ఆమె సోదరుడు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

బీహార్ రాష్ట్రంలో పరువు హత్య సంచలనం రేపింది. తమను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురుతో పాటు రెండేళ్ల చిన్నారిని ఆమె భర్తను కూడా పొట్టన బెట్టుకున్నారు. ట్రిపుల్ మర్డర్ కేసు స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో భార్యభర్తలను, వారి రెండేళ్ల చిన్నారిని యువతి తండ్రి, అన్న కలిసి హత్య చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చందన్ కుమార్(40), చందిని కుమారి(23)లు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే తన కన్నా 17 ఏళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకోవడం యువతి తండ్రికి ఇతర కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో వారిని ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. అయితే మంగళవారం సాయంత్రం బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చందన్ కుమార్, చాందిని కుమారి వారి రెండేళ్ల రోష్ణికుమారిలను యువతి తండ్రి పప్పు సింగ్ అడ్డుకుని ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. పప్పు సింగ్ కొడుకు ధీరజ్ సింగ్ వారిని తుపాకీతో కాల్చారు.

దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలీ ప్రాణాలు విడిచారు. కాగా నిందితులు పప్పు సింగ్ మరియు మహిళ తండ్రి మరియు సోదరుడు ధీరజ్ కుమార్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నౌగాచియా పోలీస్ జిల్లా ఎస్పీ సుశాంత్ కుమార్ సరోజ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురి కుటుంబాన్ని అంతమొందించిన తండ్రి సోదరుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి