iDreamPost

ఈ తండ్రికి ప్రేమకు జోహార్లు.. కూతురికి గుడికట్టి..

సాధారణంగా తండ్రికి కూతురి మీద ప్రేమ ఉండటం సహజం. అయితే, కొన్ని సార్లు ఆ ప్రేమకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. మరణం కూడా ఆ ప్రేమను ఆపలేదు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా అలాంటిదే..

సాధారణంగా తండ్రికి కూతురి మీద ప్రేమ ఉండటం సహజం. అయితే, కొన్ని సార్లు ఆ ప్రేమకు ఆకాశమే హద్దుగా ఉంటుంది. మరణం కూడా ఆ ప్రేమను ఆపలేదు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా అలాంటిదే..

ఈ తండ్రికి ప్రేమకు జోహార్లు.. కూతురికి గుడికట్టి..

షాజహాన్ ప్రేమకు చిహ్నంగా వెలసింది ‘తాజ్ మహల్’. అలానే ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రియమైన వారి జ్ఞాపకార్థం.. ఎన్నో కట్టడాలు నిర్మిస్తూ ఉంటారు. అందులో తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తండ్రి తన కూతురి మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉంటాడు. తన కూతురు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. ఆమె కోరింది ఇవ్వడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాడు. అదే కూతురు ఆ తండ్రికి దూరమైతే ఆ బాధ వర్ణించలేనిది. తిరువారూరుకు చెందిన ఓ తండ్రి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్నాడు. అయితే, తన కూతురి మీద ఉన్న ప్రేమను చాటుకునేందుకు ఈ తండ్రి ఏకంగా ఓ ఆలయాన్ని నిర్మించి..

తన కూతురు రూపుతో పోలిన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరువారూరు జిల్లాలోని కూటనల్లూరు సమీపంలో.. పుల్లమంగళానికి చెందిన వ్యక్తి సౌందర పాండియన్. ఆయన చనిపోయిన తన కుమార్తె జ్ఞాపకార్థంమై ఓ ఆలయాన్ని నిర్మించాడు. మూడు సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దానికోసం కావాల్సిన డబ్బు సమకూర్చుకున్నాడు. చివరికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని.. దానిలో తన ప్రియమైన కూతురు రూపుతో పోలిన దేవత విగ్రహాన్ని ప్రతిష్టించాడు. డిసెంబర్ 11 న పవిత్ర కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించాడు. ఈ ఆలయానికి ‘శక్తి ప్రజ్ఞా అమ్మన్’ అని నామకరణం చేశారు.

A father who built a temple for his daughter

ఈ ప్రత్యేక ఆలయం అక్కడి స్థానికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. తండ్రి, కూతుళ్ళ ప్రేమకు నిదర్శనంగా ఈ ఆలయం వెలసింది. అయితే, ఈ ఆలయ నిర్మాణ ఆలోచన వెనుక ఆ కన్న తండ్రి పడిన ఆవేదన ఎంతో ఉంది. ఐదేళ్ల క్రితం తన రెండేళ్ల కూతురు శక్తి ప్రజ్ఞ ప్రమాదవ శాత్తు.. ఇంటి ఆవరణలో ఉన్న కాలువలో పడి అకాలంగా తనువు చాలించింది. తన ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ముద్దుల కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ కన్న తండ్రి హృదయం ముక్కలైపోయింది. దీనితో ఆమెపై ఉన్న ఎనలేని ప్రేమ ఆ తండ్రికి భక్తిగా మారింది. ప్రతిరోజు తన పూజా మందిరంలో శక్తి ప్రజ్ఞ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసుకుని పూజించేవాడు.

అలా సౌందర పాండియన్ తన కూతురి జ్ఞాపకాలను మరచిపోలేక..అతని హృదయంలో కొలువు తీరిన కూతురిపై ఉన్న ప్రేమను .. కోవెలలోని అమ్మవారి విగ్రహ రూపంలోకి మార్చాడు. తన కూతురి పేరైన శక్తి ప్రజ్ఞను ‘శక్తి ప్రజ్ఞా అమ్మన్’ అని ఆలయ రూపంలో తీర్చిదిద్దాడు ఈ తండ్రి. ఈ విషయమై సౌందర పాండియన్ మాట్లాడుతూ.. “ప్రేమను దేవత అంటారు.. నా కూతురిపై నాకున్న ప్రేమ వలనే ఆమె నాలో దేవతగా మిగిలిపోయింది. నా కూతురిపై ఉన్న ప్రేమ కారణంగానే నేను ఈ ఆలయాన్ని నిర్మించాను. నా కుమార్తె కోసం ఓ స్మారక చిహ్నం ఏర్పాటు చేసి.. ప్రతి సంవత్సరం పండుగ నిర్వహిస్తాను” అని చెప్పాడు.

ఈ ఆలయం ఒక తండ్రి నిరంతర ప్రేమకు నిదర్శనం,శక్తి ప్రజ్ఞా జీవితానికి జ్ఞాపకార్థం అంటూ స్థానికులు సౌందర పాండియన్ ను ప్రశంసించారు. ఏదేమైనా, తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమకు ఏది సాటిరాదని సౌందర పాండియన్ నిరూపించారు. మరి, గుండెల్లో ఉన్న తన కూతురిపై ప్రేమను గుడి రూపంలో తీర్చిదిద్దిన తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి