iDreamPost

IPL 2022 : కోహ్లీ నువ్వు ఇలాంటివాడివా? ధోని పట్ల ఇలా ప్రవర్తిస్తావా??

IPL 2022 : కోహ్లీ నువ్వు ఇలాంటివాడివా? ధోని పట్ల ఇలా ప్రవర్తిస్తావా??

IPL 2022లో బుధవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్ జరగగా ఇందులో టాస్‌ గెలిచిన ధోని మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా చెన్నై 20 ఓవర్లకు 160 పరుగులు చేసి ఓడిపోయింది. ధోని మళ్ళీ కెప్టెన్సీ తీసుకొని ఒక మ్యాచ్ గెలవడంతో తర్వాత ఈ మ్యాచ్ మీద కూడా అంచనాలు పెరిగాయి, కానీ చెన్నై ఓడిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

అయితే ఈ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటనతో కోహ్లీని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు అంతా విమర్శిస్తున్నారు. రెండు పరుగులు చేసిన ధోని 19వ ఓవర్‌ మొదటి బంతికి జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కొట్టిన బాల్ రజత్‌ పాటిదార్‌ క్యాచ్‌ పట్టుకోవడంతో అవుట్ అయ్యాడు. అయితే ధోని అవుట్ అయిన సందర్భంగా కోహ్లి సెలబ్రేట్‌ చేసుకున్న విధానం అతడిపై విమర్శలకు కారణమవుతుంది. ధోని 2 పరుగులకే అవుట్‌ కావడంతో ఆర్సీబీ జట్టు సెలబ్రేట్ చేసుకుంది. ఇక గ్రౌండ్ లో ఉన్న కోహ్లీ ధోని అవుట్ అయ్యాడని తెగ ఆనందిస్తూ, అభ్యంతరకర భాష వాడుతూ సెలబ్రేట్‌ చేసుకున్నట్లుగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీంతో ధోని అభిమానులు, క్రికెట్ ప్రేమికులతో పాటు, కోహ్లీ అభిమానులు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో.. ‘విరాట్ కోహ్లి అభిమానిగా, అతని నుండి ఈ ప్రవర్తనను ఊహించలేదు. వికెట్ పడితే సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించకుండా చేసుకోవాల్సింది. మైదానంలో, క్రికెట్ ఆటలో ప్రవర్తన కూడా ముఖ్యమే.’, ‘ధోని పట్ల కోహ్లీ చూపించిన ప్రవర్తన సరిగా లేదు’, ‘విరాట్ ధోనిని ఇలా అంటుంటే కూడా అతనికి ఎలా సపోర్ట్ చేస్తారు’….. అంటూ పలువురు నెటిజన్లు కోహ్లీ మీద ఫైర్ అవుతున్నారు. మరి కోహ్లీ దీనికి ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి