iDreamPost

GST On Rentals అద్దెకున్న‌వాళ్లు 18% GST చెల్లించాల్సి ఉంటుందా? ప్ర‌భుత్వం క్లారిటీ

GST On Rentals అద్దెకున్న‌వాళ్లు 18% GST చెల్లించాల్సి ఉంటుందా?  ప్ర‌భుత్వం క్లారిటీ

అద్దె తీసుకున్న‌వారు ఇంటి అద్దెపై 18% GST చెల్లించాల్సిందేన‌న్న‌ తప్పుదోవ పట్టించే పోస్టుల‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇదికాస్తా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌కు దారితీయ‌డంతో ప్ర‌భుత్వం స్పందించింది.

అద్దెకుంటున్న‌వాళ్లు ఇంటి అద్దెపై 18% వస్తువులు, సేవల పన్ను (GST) చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు క‌నిపిస్తున్నాయి. ఈ పోస్ట్‌లపై స్పందించిన‌ Government’s official fact-checker అలాంటి పోస్టుల్లో నిజం లేద‌ని తేల్చేసింది.

వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తికి ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు జీఎస్టీ ఉండదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. ఒక‌ సంస్థ యజమాని లేదా భాగస్వామి వ్యక్తిగత అవ‌స‌రాల కోసం ఇంటిని అద్దెకు తీసుకున్నా కూడా GST వర్తించదు.

కాని, ఒక వ్యాపార సంస్థకు ఇంటిని, ఆఫీసును అద్దెకు ఇచ్చినట్లయితే, రెసిడెన్షియల్ యూనిట్ అద్దెపై పన్నువిధిస్తారు.

అంటే వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే జీఎస్టీని విధిస్తారు. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినా GST లేదు. యాజమాన్యం లేదా సంస్థ భాగస్వామి వ్యక్తిగత ఉపయోగం కోసం నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST లేదు, ”అని PIB ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ చేసింది. ట్వీట్ ను చూడండి.

ఆర్ధిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలో జూన్ లో జ‌రిగిన 47వ జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కొన్ని మార్పులు చేశారు. అద్దెకుంటున్న‌వాళ్లు అద్దెపై 18శాతం జీఎస్టీ క‌ట్టాల‌న్న‌ది అందులో ఒక‌టి. కాని అద్దెకుంటున్న‌వాళ్లు అంద‌రూ జీఎస్టీ క‌ట్ట‌న‌క్క‌ర్లేదు. వ్యాపార‌, వాణిజ్య అవ‌సారాల కోసం తీసుకున్న‌ప్పుడే జీఎస్టీ ప‌డుతుంది. కాని అంద‌రూ అద్దెపై జీఎస్టీ క‌ట్టాల్సిందేనంటూ సోస‌ల్ మీడియాలో పోస్టులు రావ‌డంతో దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. అందుకే కేంద్రం క్లారిటీనిచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి