iDreamPost

ఖాకీ డ్రెస్ వదిలి..ఖద్దర్ చొక్క వేసిన నాగరాజు!

KR Nagaraju: పోలీసు ఉద్యోగానికి స్వస్తి పలికి చట్టసభల్లో అడుగుపెట్టాలని కోరుకునే వారు ఎంతోమంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రజాప్రతినిధి కావాలనే ఆశతో పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి జాబితాలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చేరారు.

KR Nagaraju: పోలీసు ఉద్యోగానికి స్వస్తి పలికి చట్టసభల్లో అడుగుపెట్టాలని కోరుకునే వారు ఎంతోమంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రజాప్రతినిధి కావాలనే ఆశతో పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి జాబితాలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చేరారు.

ఖాకీ డ్రెస్ వదిలి..ఖద్దర్ చొక్క వేసిన నాగరాజు!

సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను అరికడుతూ ప్రజలను రక్షించే వారే పోలీసులు. ఇలా చాలా మంది పోలీసులు ప్రజ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు. అయితే కొందరు పోలీసులు ఖాకీ చొక్క వదలి..ఖద్దరు చొక్క ధరించి.. అసెంబ్లీ గేటు తొక్కాలని కోరుకుంటారు. ఇలా చాలా మంది ఆశపడిన కొంతమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరో పోలీస్ అధికారి.. ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభల్లో అడుగు పెట్టారు. మరి.. ఆయన ఎవరు? ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 64 మంది కాంగ్రెస్ తరపున గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టారు. వారిలో ఒకరు వరంగల్ జిల్లా వర్దన్న పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు. అందరిలాగా సాధారణ వ్యక్తి అయి ఉంటే అంత స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. కానీ ఓ ప్రత్యేక కారణంతో ఆయన ఇప్పుడు జనంలో చర్చగా మారారు. ఐపీఎస్ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది.. వెంటనే ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నాగరాజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పదవీ విరమణ పొందిన వెంటనే ఖాకీ డ్రెస్ వదిలి, ఖద్దర్ చొక్కా వేశాడు. అంతేకాక అనూహ్యంగా ఆయనకు కాంగ్రెస్ తరపున వర్ధన్నపేట నుంచి టికెట్ లభించింది. అందివచ్చిన అవకాశంతో ఎలాగైన గెలవాలని నాగరాజు భావించారు. అందుకే ప్రజల్లో నిత్యం తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చివరకు వర్దన్న పేట సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. దీంతో నాగరాజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఇక ఆయన పోలీసుల విధుల విషయానికి వస్తే.. హనుమకొండకు చెందిన కె.ఆర్ నాగరాజు 1989లో ఎస్సైగా పోలీస్ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, నిజామాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 2023 మార్చిలో ఆయన పదవీ విరమణ చేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లి ప్రజా సేవ చేయాలని ఆయన భావించారు. దీంతో పదవి విరమణ చేసిన వెంటనే నాగరాజు ఖాకీ డ్రెస్ తీసేసి ఖద్దర్ చొక్కా వేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజల సమస్యలు తెలుసుకునే వారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్దన్నపేట ఎస్సీ రిజర్వుడ్  కావడంతో నియోజక వర్గం నుండి ఆయనను బరిలోకి దింపింది. వర్ధన్నపేటలో బలమైన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై నాగరాజు భారీ మెజారిటీతో విజయం సాధించి..రికార్డ్ సృష్టించారు. మొన్నటి వరకు ఖాకీ డ్రెస్ లో క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. తాజాగా ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రతినిధిగా తన మార్క్ చూపుతున్నారు. పోలిస్ అధికారిగా విజయం సాధించిన ఆయన, రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ఎలాంటి మార్క్ చూపిస్తారో చూడాల్సి ఉంది. మరి.. ఈ ఖాకీ, ఖద్దరు బాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి