iDreamPost

అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చకపోతే చేరకండి.. బలవంతం చెయ్యట్లేదు.. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యలు..

అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చకపోతే చేరకండి.. బలవంతం చెయ్యట్లేదు.. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యలు..

అగ్నిపథ్‌ ని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం, అగ్నిపథ్ పై తప్పుడు ప్రచారం చేయడం, విపక్షాలు రెచ్చగొట్టడంతో దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో అగ్నిపథ్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇవి హింసాత్మకంగా మారి కేంద్ర ఆస్తులకి భారీ నష్టాలు కలిగించాయి. అయితే అగ్నిపథ్ ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఏకంగా త్రివిధ దళాలే అగ్నిపథ్ కి సపోర్ట్ గా ప్రెస్ మీట్ కూడా పెట్టాయి. తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు,

వీకే సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చకపోతే అభ్యర్థులు దానిని ఎంచుకోవద్దు. అగ్నిపథ్ స్కీమ్‌ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరొద్దు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చెయ్యట్లేదు. సైన్యంలో చేరాలనుకునే వారు, దేశం కోసం పని చేయాలి అనుకునే వాళ్ళే ఇష్టంతో నిర్ణయం తీసుకోండి. బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఇలా ఆందోళనలు చేసి దేశ సంపదకు నష్టం కలిగించే వాళ్ళు ఎంత మాత్రం ఆర్మీకి అర్హులు కారు. 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడే అగ్నిపథ్‌ గురించి ఆలోచించాం అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి