iDreamPost

స్టార్ హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తిపలుకుతూ..

Star Heroine Divorce: ప్రేమ వివాహాలు చేసుకొని కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు.. తాజాగా మరో జంట విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫామ్ చేశారు.

Star Heroine Divorce: ప్రేమ వివాహాలు చేసుకొని కొంత కాలం తర్వాత విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు.. తాజాగా మరో జంట విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫామ్ చేశారు.

స్టార్ హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తిపలుకుతూ..

వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల ఆశీర్వాదంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండూ నూరేళ్లు కలిసి ఉండాలని దీవిస్తుంటారు. పెళ్లైన తర్వాత ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాల నేపథ్యంలో విడిపోతున్నారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబట్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ కొంత కాలానికి అభిప్రాయ బేధాల తో కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటున్నారు. మరికొంతమంది పదేళ్ల పాటు హ్యాపీగా కాపురం చేసి అనూహ్యంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అలాంటి జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్స్, సీనియర్ నటి హేమా మాలిని కూతురు, నటి ఈషా డీయోల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈషా డీయోల్ తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘యువ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈషా డీయోల్. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే 2012లో భరత్ తక్తానీని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత మూడేళ్ల పాటు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనా చూసుకోవడానికే సమయం సరిపోయింది. ఇక డిజిటల్ ఓటీటీలో రావడంతో ఆ అమ్మడు ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

12 ఏళ్ల పాటు వీరి వివాహబంధం ఎంతో సాఫీగా కొనసాగింది. ఇటీవల ఈ జంట మధ్య అభిప్రాయభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు తెలిపింది ఈషా. తనకు పిల్లలు చాలా ముఖ్యం అని.. తమ గొడవలు పిల్లల కెరీర్ పై పడకూడదని ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె అన్నారు. బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర-హేమ మాలిని పెద్ద కూతురు ఈషా డీయోల్. 2002లో వినయ్ శుక్లా దర్శకత్వంలో ‘కొయీ మేరే దిల్ సే పూచే’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003 లో ఎల్ఒసి కార్గిల్, ధూమ్, ఇన్సాన్, నో ఎంట్రీ, షాదీ నెం.1 మూవీస్ ఈషా డీయోల్ కి మంచి పేరు తెచ్చాయి. కొంత కాలంగా ఈ జంటను కలిపి ఉంచేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా.. అది వర్క్ ఔట్ కాకపోవడంతో ఈ జంట విడిపోయినట్లు అర్థమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి