iDreamPost

Enugu Movie Review ఏనుగు రిపోర్ట్

Enugu Movie Review ఏనుగు రిపోర్ట్

నిన్న చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ ఉన్నవాటిలో మనవాళ్ళ దృష్టి పక్కా కమర్షియల్ మీదే ఉండటంతో మిగిలినవాటి మీద అంతగా ఫోకస్ వెళ్ళలేదు. అందులో ఏనుగు ఒకటి. ప్రభాస్ సాహోలో విలన్ గా నటించిన అరుణ్ విజయ్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. కాకపోతే అక్కడ ఆడినవి తెలుగులో ఎప్పుడూ డబ్బింగ్ రూపంలో రాలేదు కాబట్టి టాలీవుడ్ లో ఇమేజ్ లేకుండా పోయింది. అందుకే ఓ ట్రై వేద్దామని ఏనుగుతో వచ్చాడు. సూర్యని పవర్ ఫుల్ గా పోలీస్ గా చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్న హరి ఈ ఏనుగుకి దర్శకుడు. ట్రైలర్ గట్రా రొటీన్ ఎంటర్ టైనరన్న ఫీలింగ్ ఇచ్చినప్పటికీ అసలింతకీ ఇందులో ఏముందో రిపోర్ట్ లో చూద్దాం.

ఈ కథ కాకినాడ ప్రాంతంలో జరుగుతుంది. రెండు కుటుంబాలు పివిఆర్, సముద్రంలకు శత్రుత్వం ఉంటుంది. వరసకు సవతి సోదరులైన రవి(అరుణ్ విజయ్), అతని అన్నయ్య(సముతిరఖని)లకు ఒకరంటే ఒకరికి పడదు. అందరికీ మంచి జరగాలని తాపత్రయపడే రవి ఊహించని విధంగా కుటుంబంలోనే అవమానం ఎదురుకుంటాడు. మరోవైపు ఇద్దరి ఫ్యామిలీస్ లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని దాన్ని లింగం(కెజిఎఫ్ గరుడరామ్)లాంటి వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. దాయాదులను తనవైపు తిప్పుకునేందుకు రవి ఏం చేశాడు, అసలు ఏనుగు టైటిల్ కి సినిమాకు సంబంధం ఏంటనేది తెరపైనే చూడాలి.

స్టోరీ లైన్ గతంలో చాలాసార్లు చూసిందే కావడంతో కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఏమీ ఉండదు. విశాల్ పూజ ఈ టైపులో వచ్చిందే. కాకపోతే దర్శకుడు హరి తనదైన మేకింగ్ స్టైల్ తో యాక్షన్ ని ఎమోషన్స్ ని బాలన్స్ చేయడంతో మరీ ఎక్కువ విసుగు రాదు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంటర్ టైనింగ్ గా రేండో సగం లేకపోవడం ఏనుగుకున్న మైనస్. ఓవర్ డ్రామా వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇది అరవ బ్యాచ్ కు కనెక్ట్ అవుతుంది కానీ మనకు కాదు. అరుణ్ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ నటన బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా కుదిరారు. నిడివి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఎంత రెగ్యులర్ గా ఉన్నా కమర్షియల్ అంశాలతో ఓ మోస్తరు అంశాలతో టైం పాస్ చేయాలంటే ఏనుగు ఎక్కొచ్చు.దిగి వెళ్ళేటప్పుడు గొప్ప ఫీలింగ్ మాత్రం ఇవ్వదు. జస్ట్ ఓకే అనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి