iDreamPost

క్లాసు మాసు కలిసిన “ఎంత మంచివాడవురా”

క్లాసు మాసు కలిసిన “ఎంత మంచివాడవురా”

బాక్స్ ఆఫీస్ దిగ్గజాల మధ్య అండర్ డాగ్ తరహాలో సైలెంట్ గా వస్తున్న ఎంత మంచివాడవురా ట్రైలర్ ని నిన్న జరిగిన వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఓ మోస్తరు అంచనాలే ఉన్న ఈ సినిమా మీద హైప్ పెంచడానికి ట్రైలర్ ఉపయోగపడిందని చెప్పాలి. కథ విషయానికి వస్తే పేర్లతో పిలవడానికన్నా బంధుత్వంతో పిలుచుకోవడాన్ని ఇష్టపడే ఓ యువకుడి ప్రయాణమే ఈ స్టోరీ. 

గోపి సుందర్ సంగీతం, రాజ్ తోట ఛాయాగ్రహణం మంచి రిచ్ నెస్ తీసుకొచ్చాయి. కళ్యాణ్ రామ్ కు తగిన పాత్రే అనిపిస్తోంది. హీరో వెంట ప్రేమ అంటూ వెంటపడే పాత్రలో మెహ్రీన్ అంత కొత్తగా ఏమి కనిపించడం లేదు. రాజీవ్ కనకాల మెయిన్ విలన్ కావడమే ఇందులో అసలు ట్విస్ట్. విపరీతమైన పోటీలో ఆఖరున వస్తున్న ఎంత మంచివాడవరురా తననూ ఒక ఛాయస్ గా పెట్టుకోవచ్చనే మెసేజ్ ట్రైలర్ లో ఇచ్చాడు.

తన తండ్రి(తనికెళ్ళ భరణి)కి అండగా నిలబడుతూ ఆయన జోలికి వచ్చిన విలన్(రాజీవ్ కనకాల) భరతం పట్టే పాత్రలో రిషి(కళ్యాణ్ రామ్)అన్ని షేడ్స్ చూపించాడు. మధ్యలో శరత్ బాబు-సుహాసిని ఫ్యామిలీకి సైతం తోడుగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాడు. తాతయ్య(విజయ్ కుమార్)అని పిలుచుకునే మరో వ్యక్తికి కూడా ఋషితో సంబంధం ఉంటుంది. అసలు ఇంత మందితో కథానాయకుడికి ఉన్న రిలేషన్ ఏంటి, అందరూ కలియుగ దేవుడు అని పిలుచుకునేంత మంచితనం ఇతనిలో ఏముంది తెలియాలంటే సినిమా చూడాలనంటోంది యూనిట్
మొత్తానికి టార్గెట్ చేసిన కుటుంబ ప్రేక్షకులతో పాటు నందమూరి హీరోలకు అండగా ఉండే మాస్ ఆడియన్స్ సైతం సంతృప్తి పడేలా అన్ని మసాలాలు కూర్చాడు దర్శకుడు సతీష్ వేగ్నేశ. హీరో జామపండు కోస్తూ మధ్యలో చిన్న కత్తితో కారం పెడుతూ విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ బాగా పేలింది. సాఫ్ట్ సినిమాలను మాత్రమే డీల్ చేసిన సతీష్ ఇందులో అందరిని సంతృప్తి పరిచే విధంగా కథనాన్ని నడిపించినట్టు అర్థమవుతోంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి