iDreamPost

Yashasvi Jaiswal: 22 ఏళ్లకే ఇంత టాలెంటా? జైస్వాల్ ఆటకు ఫిదా అయిన ఇంగ్లాండ్ దిగ్గజం!

22 ఏళ్లకే ఇంత టాలెంటా? అంటూ యశస్వీ జైస్వాల్ ఆటకు ఫిదా అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజం ఆటగాడు అలిస్టర్ కుక్. తన కెరీర్ లో చూసిన అద్బుత ఇన్నింగ్స్ లలో ఇది ఒకటని జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

22 ఏళ్లకే ఇంత టాలెంటా? అంటూ యశస్వీ జైస్వాల్ ఆటకు ఫిదా అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజం ఆటగాడు అలిస్టర్ కుక్. తన కెరీర్ లో చూసిన అద్బుత ఇన్నింగ్స్ లలో ఇది ఒకటని జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Yashasvi Jaiswal: 22 ఏళ్లకే ఇంత టాలెంటా? జైస్వాల్ ఆటకు ఫిదా అయిన ఇంగ్లాండ్ దిగ్గజం!

క్రికెట్ అభిమానుల అందరి నోట ఒక్కటే మాట.. జైస్వాల్.. జైస్వాల్. ఇంగ్లాండ్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. తన కెరీర్ లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసుకున్నాడు ఈ యువ సంచలనం. దీంతో పాటుగా పలు రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ 22 ఏళ్ల యంగ్ ప్లేయర్ ఆటకు ఫిదా అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్ కుక్. ఇంత చిన్న వయసులో ఇలా ఆడే ఆటగాడిని నేనింతవరకు చూడలేదని ప్రశంసల వర్షం కురిపించాడు కుక్. సీనియర్లు విఫలం అయిన చోట సత్తాచాటాడు యశస్వీ.

ప్రపంచం మెుత్తం టీమిండియా యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ఆటపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో సీనియర్లు విఫలం అయిన చోట.. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో కెరీర్ లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసుకున్నాడు ఈ స్టార్ ఓపెనర్. 290 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 209 పరుగులు చేసి 8వ వికెట్ గా వెనుదిరిగాడు. ఒకవైపు సహచర బ్యాటర్లంతా విఫలం అవుతూ.. పెవిలియన్ చేరుతుంటే, తానొక్కడే ఇన్నింగ్స్ కు వెన్నముకగా నిలబడ్డాడు. జైస్వాలే కనక ఆడకపోయి ఉంటే.. టీమిండియా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యేది.

Jaiswal is a giant of England who is fed up with the game!

ఇక ఈ ఇన్నింగ్స్ లో యశస్వీ బ్యాటింగ్ చూసి ఫిదా అయ్యాడు ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కుక్ మాట్లాడుతూ..”కేవలం 22 ఏళ్ల వయసుకే ఇంత టాలెంటా? నేను నమ్మలేకపోతున్నాను. జైస్వాల్ తాజాగా ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతం. ఇంత చిన్న వయసులోనే అపారమైన అనుభవం ఉన్నవాడిలా.. అసాధారనమైన ప్రతిభను అతడు కనబరుస్తున్నాడు. ఇక నా కెరీర్ లో చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ లలో ఇది ఒకటి. అతడిని ఆపకపోతే ఇంగ్లాండ్ కు రాబోయే టెస్టుల్లో కష్టాలు తప్పవు” అంటూ హెచ్చరించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయిన చోటే ఇలా చిచ్చర పిడుగులా జైస్వాల్ చెలరేగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు కుక్.

ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలు గుప్పించాడు ఈ ఇంగ్లాండ్ దిగ్గజం. టీమిండియా బ్యాటింగ్ లో జైస్వాల్ ఇన్నింగ్స్ మినహా మిగతా వారందరూ దారుణంగా విఫలం అయ్యారని, భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పేలవంగానే ఉందని విమర్శించాడు కుక్. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కూడా యశస్వీని ఆపడంలో విఫలం అయ్యారని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బషీర్, రెహన్ అహ్మద్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో జాక్ క్రాలీ(51), ఓలీ పోప్(2) బ్యాటింగ్ చేస్తున్నారు. మరి జైస్వాల్ పై ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: ఇంట్లో నుంచి పారిపోయి.. టీమిండియాకు హీరో అయ్యాడు! ది జైస్వాల్‌ స్టోరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి