iDreamPost

ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులను వాడుకోవచ్చు: ఎన్నికల కమిషన్‌

  • Published Feb 15, 2024 | 1:37 PMUpdated Feb 15, 2024 | 1:37 PM

ఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వాడుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల వేళ ఎలక్షన్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వాడుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసింది.

  • Published Feb 15, 2024 | 1:37 PMUpdated Feb 15, 2024 | 1:37 PM
ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులను వాడుకోవచ్చు: ఎన్నికల కమిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్‌సీపీ పార్టీ బలంగా నిర్ణయించుకుంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇక అటు చూస్తే విపక్ష కూటమి టీడీపీ-జనసేనలో ఎన్నికల హడావుడి ఇంకా మొదలు కాలేదు. అసలు సీట్ల పంపణీ వ్యవహారమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ విషయం అలా ఉంచితే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

ఏపీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. ఎన్నికల విధుల కోసం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించుకునేందుకు నో అబ్జెక్షన్‌ లెటర్‌ ఇచ్చింది. అయితే వారిని బూత్‌ స్థాయి అధికారులుగా నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమీపిస్తోన్న వేళ ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారు. ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరి ద్వారా.. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకే చేరుస్తున్నారు. ఇక జగన్‌ సర్కార్‌ ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు నగదు బహుమతి అందిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ ఏడాది వారికి అందించే నగదు పురస్కారం మొత్తాన్ని భారీగా పెంచింది ఏపీ ప్రభుత్వం.

సేవా వజ్ర కింద ఇప్పటి వరకూ 30 వేల రూపాయల నగదు పురస్కారం అందిస్తుండగా.. ఈ ఏడాది ఈ మొత్తాన్ని 45 వేలకు పెంచారు. అలానే సేవా రత్న అవార్డు విన్నర్లకు ఇచ్చే మొత్తాన్ని 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. దాంతో సేవామిత్రగా నిలిచిన వాలంటీర్లకు ఇచ్చే మొత్తాన్ని కూడా పది వేల నుంచి 15 వేలకు పెంచారు. నేడు అనగా ఫిబ్రవరి 15, గురువారం నాడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి