iDreamPost

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదు!

ప్రపంచ వ్యాప్తంగా తరుచూ భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెెల ఆఫ్ఘనిస్తాన్.. ఈ నెల నేపాల్ లో భారీ భూకంపాలు సంభవించాయి. నేపాల్ భూకంప ప్రభావం భారత్ పై పడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా తరుచూ భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెెల ఆఫ్ఘనిస్తాన్.. ఈ నెల నేపాల్ లో భారీ భూకంపాలు సంభవించాయి. నేపాల్ భూకంప ప్రభావం భారత్ పై పడుతుంది.

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదు!

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్, నేపాల్, చైనా, ఇండోనేషియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో భారీగా భూకంపం సంభవించింది. మూడు సార్లు ఒకే ప్రదేశంలో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటన మరువక ముందే హిమాలయ దేశం అయిన నేపాల్ లో వరుస భూకంపాలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది.. భూకంప ధాటికి 160 మందికి పైగా మరణించారు.. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సహా ఉత్తర భారత దేశంలో పలు చోట్ల భూ ప్రకంపణలు సంభవించాయి. వివరాల్లోకి వెళితే..

నేపాల్ లో వరుస భూకంపాల ప్రభావం భారత్ పై కూడా పడుతున్నాయి. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం 3.6 తీవ్రతతో భూమి కంపించింది. సోమవారం కూడా ఇక్కడ పలు చోట్ల భూమి కంపించనట్లు వార్తలు వస్తున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. నేపాల్ లో ఏర్పడిన ప్రకంపణలు ఇప్పుడు ఢిల్లీకి వ్యాపించాయి. సోమవారం సాయంత్రం 4.20 ప్రాంతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6 గా నమోదు అయ్యింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులు భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుంతో అని టెన్షన్ పడ్డారు. ఇప్పటికే నేపాల్ లో సంభవించిన భూకంపాలతో భయపడి పోయిన విషయం తెలిసిందే. కాగా, మూడు రోజుల నుంచి ఢిల్లీలో భూ ప్రకంపనలు రావడం ఇది రెండవసారి. ఢిల్లీతో పాటు లక్నో, రీజియన్ ప్రాంతంల్లో భూ ప్రకంపణలు సంభవిచంినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అధికారులు తెలిపారు. శుక్రవారం సంభవించిన భూకంపంలో ఢిల్లీతో పాటు బీఆహార్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లో భూమి కంపించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారుల తెలిపారు. ఇటీవల తరుచూ సంభవిస్తున్న భూ కంపాల వల్ల ప్రజలు ఎప్పుడు ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి