iDreamPost

జమ్మూ కాశ్మీర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రత నమోదు

  • Published Nov 16, 2023 | 12:20 PMUpdated Nov 16, 2023 | 12:20 PM

ఈ మద్య భారత్ లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలలో పలుమార్లు ఎక్కడో అక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి.

ఈ మద్య భారత్ లో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నెలలో పలుమార్లు ఎక్కడో అక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి.

  • Published Nov 16, 2023 | 12:20 PMUpdated Nov 16, 2023 | 12:20 PM
జమ్మూ కాశ్మీర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రత నమోదు

ఈ మద్య వరుస భూకంపాంలు వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండాన్ని వరుస భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత నెల ఆఫ్ఘనిస్థాన్ లో వచ్చిన భూకంప దాటికి రెండు వేల మంది చనిపోయారు. ఒకోచోట వరుసగా మూడు సార్లు భూకంపం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఈ నెల 3 వ తేదీ అర్ధరాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. ఈ ఘటనలో 160 మందికి పైగా చనిపోయారు.. ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. నేపాల్ లో భూకంప ప్రభావం భారత్ పై కూడా పడింది.. ఈ క్రమంలోనే ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తాజాగా జమ్మూ కాశ్మీర్ ని భూకంపం వణికించింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం భారత్ పై చూపిస్తుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9.34 గంటల ప్రాంతంలో దోడా జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం తెల్లవారు జామున 2.02 గంటలకు ఉత్తర కాశీలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.1 గా నమోదు అయినట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది.

ఇది భూ అంతర్భాగంలో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం రాజధాని డెహ్రాడూన్ కి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. అర్థరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉత్తరకాశీలో గత 15 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి